ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సిద్ధమవుతున్న రిపబ్లిక్ డే వేడుకలు.

0
629

 

>కేవీస్సార్. కోటేశ్వరరావు. గుంటూరు.

 

గుంటూరు జిల్లా పోలీస్...* *తేది : 06.01.2026* _*//ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సిద్ధమవుతున్న రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణ ప్రదేశాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు,.//*_ 🚩 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ది.26.01.2026న అమరావతి రాజధానిలో జరగనున్న రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణకు సంబంధించి, తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయపూడి గ్రామపంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి హైకోర్టు వైపు వెళ్లే రహదారి కుడి వైపున సిద్ధం చేస్తున్న వేడుకల నిర్వహణ ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు ఈ రోజు పరిశీలించారు. 🔅 వేడుకల నిర్వహణ ప్రదేశాన్ని చిత్ర పటం (లేఅవుట్) ఆధారంగా సమగ్రంగా, ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఏర్పాట్లపై స్పష్టమైన మార్గదర్శకాలు అందజేశారు. 🔅 రిపబ్లిక్ డే వేడుకలు ప్రశాంతంగా, సురక్షితంగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా నిర్వహించేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలను ముందస్తుగా చేపట్టాలని సంబంధిత అధికారులకు జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు. 👉 ఈ పరిశీలన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు సీఆర్‌డీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ విద్యాసాగర్ రావు గారు, తుళ్లూరు డీఎస్పీ శ్రీ మురళీకృష్ణ గారు, ఎస్బి డీఎస్పీ శ్రీనివాసులు గారు, ఎస్బి సీఐ అలహరి. శ్రీనివాస్ గారు, తుళ్లూరు పోలీస్ స్టేషన్ సీఐలు K.శ్రీనివాసరావు గారు, ఎం. శ్రీనివాసరావు గారు, ట్రాఫిక్ సీఐ కోటేశ్వరరావు గార్లు పాల్గొని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నూరు నియోజకవర్గ :సదుంలో పర్యటించిన తంబళ్లపల్లె ఎమ్మెల్యే
పుంగనూరు నియోజకవర్గం, సదుం లో తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి శుక్రవారం...
By Kothuru Murali 2026-03-21 06:20:14 0 157
Puducherry
Puducherry Advances Education Reforms and Digital Learning
Puducherry is strengthening its education sector through innovative reforms and the adoption of...
By Fathima Safa 2026-06-20 06:20:29 0 111
Business & Finance
Advancing postal cooperation for a more connected world!
Secretary (Posts), Ms. Vandita Kaul led the Indian delegation at the Pan African Postal Union...
By Bharat Aawaz 2025-07-02 17:43:35 0 2K
Andhra Pradesh
ఉమ్మడి విజయనగరం జిల్లా మహిళా ఎమ్మెల్యేల శారీ వాక్
విజయవాడలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు శుక్రవారం సందడి చేశారు. అసెంబ్లీ...
By Boiena Rajesh 2026-03-07 02:40:50 0 242
Telangana
గంజాయి తీసుకుంటూ దొరికిన MLA కుమారుడు
TG: ఈగల్ టీమ్ తనిఖీల్లో ఎమ్మెల్యే కుమారుడు పట్టుబడ్డారు. నానక్రామ్గూడలో నిర్వహించిన తనిఖీల్లో ఏపీ...
By Mitappaly Shiavji 2026-01-03 10:57:31 0 600
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com