వన్ నేషన్- వన్ ఎలక్షన్ తోనే దేశాభివృద్ధి సాధ్యం.|

0
227

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగాలన్న వన్ నేషన్ – వన్ ఎలక్షన్ విధానానికి భారతీయ జనతా పార్టీ మేడ్చల్ అర్బన్ డిస్ట్రిక్ట్ కో కన్వీనర్ కరుణశ్రీ కందుకూరి, బలమైన మద్దతు తెలిపారు.

తుర్కపల్లి ప్రాంతంలోని ప్రాథమిక పాఠశాలలో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో...

కరుణశ్రీ మాట్లాడుతూ…

కౌన్సిలర్, కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తే ఎన్నికల ఖర్చులు భారీగా తగ్గుతాయని, ప్రజలపై పడే ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు.ఎన్నికల కారణంగా పదే పదే అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయని, వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అమలుతో స్థిరమైన పాలన, వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమానికి..మేడ్చల్–మల్కాజ్‌గిరి బీజేపీ కన్వీనర్ అంజలిదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అనురాధ దేవి, విజయ్ మరియు కార్యకర్తలు పాల్గొని ప్రజలకు వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అవసరాన్ని వివరించారు.

ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.

 

#sidhumaroju.

Search
Categories
Read More
Andhra Pradesh
ఇది జగన్ రెడ్డి వంకర బుద్ధికి నిదర్శనం: నారా లోకేష్.
  ఇది జగన్ రెడ్డి వంకర బుద్ధికి నిదర్శనం: నారా లోకేష్ Andhra Nara Lokesh Slams YSRCP for...
By Pagadala Venkateswar 2026-05-25 04:39:52 0 125
Telangana
గణేష్ ఉత్సవాలు ఐక్యతకు ప్రత్యేకంగా నిలుస్తాయి : బిఆర్ఎస్ నాయకులు శంబీపూర్ కృష్ణ.
     మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:   వినాయక చవితి ఉత్సవాల భాగంగా ...
By Sidhu Maroju 2025-09-09 17:12:50 0 377
Telangana
నిజామాబాద్: పోలీస్ కోమెష్నార్ యక్షన్ ప్లాన్
నిజామాబాద్: ప్రజాపాలన-ప్రగతి ప్రణాలిక కార్యక్రమంలో భగంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజాన్...
By Sadaq Sadaq 2026-03-25 17:11:58 0 198
Telangana
ఖమ్మం జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల బదిలీలు..
ఖమ్మం జిల్లాలో 10 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేస్తూ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి...
By Krishna Balina 2026-03-06 09:48:03 0 452
Andhra Pradesh
మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో మరో నిందితుడు అరెస్ట్: డీఎస్పీ.
మదనపల్లిలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు మరో నిందితుడిని అరెస్టు చేశారు....
By Pagadala Venkateswar 2026-02-15 05:43:51 0 213
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com