పరుగులు పెడుతున్న డోన్ నియోజకవర్గ అభివృద్ధి పనులు :

0
222

కర్నూలు :  డోన్ డోన్ నియోజకవర్గంలో సమగ్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. పట్టణాలు, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోంది.

ఈ క్రమంలో ఈ రోజు డోన్ పట్టణంలోని ఎస్.సి. బరియల్ గ్రౌండ్‌లో రూ. 9.20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రహరీ గోడ మరియు నీటి సదుపాయాల ఏర్పాటు పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు

ఈ కార్యక్రమంలో గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు పాల్గొని భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ,డోన్ నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అభివృద్ధి అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ముఖ్యంగా ఎస్సీ సమాజానికి సంబంధించిన సౌకర్యాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

బరియల్ గ్రౌండ్ అభివృద్ధితో పరిశుభ్రత, భద్రత, తాగునీటి సౌకర్యాలు మెరుగుపడి ప్రజలకు మరింత ఉపయోగకరంగా మారుతాయని పేర్కొన్నారు.

ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేస్తూ నాణ్యమైన పనులు చేపట్టి, నిర్ణీత గడువులో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే గారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు క్రిస్టియన్ కమ్యూనిటీ సభ్యులు ,పాస్టర్లు స్థానికులు పాల్గొన్నారు.

 

Search
Categories
Read More
Telangana
సూర్యాపేట లోని RTC బస్టాండ్ లో రాస్తా రోక
సిపిఎం పార్టీ నాయకులు తెలంగాణ ఆవిర్బవా దినోత్సవం పురస్కరించుకొని.. గత ప్రభుత్వం తెలంగాణ ను...
By Mahankali Ravi 2026-06-03 07:13:32 0 150
Andhra Pradesh
పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు
రొంపిచర్ల మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల...
By Kothuru Murali 2026-03-31 05:19:33 0 165
Andhra Pradesh
పుంగనూరు: జాతీయ రహదారిపై స్థానికుల నిరసన
పుంగనూరు బెంగళూరు జాతీయ రహదారిపై సోమవారం స్థానిక ప్రజలు నిరసన తెలిపారు. పుంగనూరు-ముళ బాగిల్...
By Kothuru Murali 2026-04-07 05:39:12 0 168
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : మహా సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దిరెడ్డి
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, మంగళంపేటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి మహా...
By Kothuru Murali 2026-02-20 11:00:54 0 152
Andhra Pradesh
విజయవాడ గొల్లపూడి లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
*పత్రికా ప్రకటన* *విజయవాడ, తేదీ: 14.01.2026*   *• గొల్లపూడిలో అంగరంగ వైభవంగా...
By Rajini Kumari 2026-01-14 12:23:38 0 182
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com