మినీ అంగన్‌వాడీలకు పదోన్నతి: 39 మందికి ఉత్తర్వుల పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే ముత్తుముల.

0
259

కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీలుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో, నియోజకవర్గంలోని లబ్ధిదారులకు పదోన్నతి పత్రాలను ఆయన పంపిణీ చేశారు. శుక్రవారం సాయంత్రం గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గిద్దలూరు మరియు బెస్తవారిపేట మండలాలకు చెందిన 39 మంది మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పదోన్నతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్‌వాడీల పట్ల అత్యంత సానుకూలంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంగన్‌వాడీలు కోరిన 15 ప్రధాన డిమాండ్లలో ఇప్పటికే 13 డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చిందని ఆయన స్పష్టం చేశారు. అంగన్‌వాడీలు పదవీ విరమణ చేసిన అనంతరం ఇచ్చే ఆర్థిక సాయాన్ని 1,20,000 రూపాయలకు పెంచడం, మట్టి ఖర్చుల నిమిత్తం ఇచ్చే మొత్తాన్ని 15,000 రూపాయలు, పదవీ విరమణ కాలాన్ని 62 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగిందన్నారు.. తమ చిరకాల వాంఛ అయిన పదోన్నతిని కల్పించినందుకు, అలాగే తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారికి అంగన్‌వాడీ కార్యకర్తలు కృతజ్ఞతలు తెలియజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.... మహిళతో పాటు ఏడు గేదెల మృతి..
బాపట్ల జిల్లా: వాడరేవు నుండి పిడుగురాళ్లకు వెళ్లే జాతీయ రహదారి–167పై సోమవారం సాయంత్రం ఘోర...
By Gadiyapudi Narendra 2026-03-03 05:38:38 0 278
Andhra Pradesh
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి తో చంద్రబాబు నాయుడు భేటీ
*ఢిల్లీ:*   *ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2026-02-10 10:24:43 0 205
SURAKSHA
రోడ్డు ప్రమాద బాధితులకు ఆపన్నహస్తం అందించిన పోలీసులు
నిన్న రహదారిపై జరిగిన ప్రమాదంలో గాయపడిన బాధితులను చూసి ఏపీ పోలీసులు మానవత్వంతో స్పందించారు....
By Kalaga Sailaja 2026-06-30 11:09:38 0 116
Telangana
జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారిగా K. నవీన్ కుమార్
మహబూబాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారిగా వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్...
By Bheeshman King 2026-07-03 12:43:41 0 646
Telangana
భూ కబ్జాదారుడంటూ తనపై చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండించిన మామిడి జనార్ధన్ రెడ్డి.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ లోని సర్వే నెంబర్ 573, 574 లో ఉన్న ఐదు ఎకరాల స్థల సరిహద్దు...
By Sidhu Maroju 2025-10-11 13:01:46 0 290
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com