పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా.బూర్ల రామాంజనేయులు గారు.

0
241

ప్రత్తిపాడు మండలం,కొండెపాడు గ్రామం నందు రూ.13 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని, అనంతరం రైతులకు,భూ యజమానులకు క్యూ ఆర్ కోడ్ తో ముద్రించబడిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా.బూర్ల రామాంజనేయులు గారు.

గౌరవ శాసనసభ్యులు వారు మాట్లాడుతూ:

రైతుల క్షేమమే కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన థ్యేయం.

గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి రైతుకు, భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. 

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జారీ చేసే పట్టాదారు పాస్ పుస్తకంపై రాజకీయాలకు సంబంధించిన ఎటువంటి ముద్రలు మరియు చిత్రాలు ఉండవు, రాష్ట్ర ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ఉంటుంది. 

రైతు చేతికి వెళ్ళాక ఎటువంటి తప్పులు ఉండకుండా ఉండేలా ముందస్తుగానే ప్రభుత్వ సూచన మేరకు యంత్రాంగం ఈ చర్యలు చేపట్టింది. 

వైకాపా ప్రభుత్వ హయాంలో జగనన్న భుహక్కు భూ రక్ష పథకం పేరుతో భూములను రీసర్వే చేసింది. 

రే సర్వే పూర్తయిన గ్రామాల్లోని రైతుల భూములకు సంబంధించి భూ హక్కు పత్రం పేరుతో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రాన్ని పట్టాదారు పాసుపుస్తకం పై ముద్రించారు. 

రి సర్వే లో అనేక లోపాలున్నా వాటిని సరిచేయకుండా వదిలేశారు. 

రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. 

కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో భూ యజమాని చిత్రంతో, రాజముద్రతో అందిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఈరోజు నుండి మండలాల వారీగా సభల్లో పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. 

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,రెవెన్యూ అధికారులు,రైతులు,భూ యజమానులు,అభిమానులు,కార్యకర్తలు,మహిళలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు...

Search
Categories
Read More
Andhra Pradesh
గుంటూరు జిల్లాలో ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్ – 720 చలానాలు, రూ.4,74,080 /- జరిమానా; 720 మందికి రోడ్డు భద్రత అవగాహన
గుంటూరు జిల్లాలో ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్ – 720 చలానాలు, రూ.4,74,080 /- జరిమానా; 720 మందికి...
By Chennaiah Kati 2026-07-10 16:25:56 0 189
Andhra Pradesh
కార్యకర్తకు అండగా నిలిచిన ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి
కొత్త సంవత్సరం వేళ.. అందరూ అత్యంత ఆనందోత్సాహాల నడుమ నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు...
By John Baji 2026-01-01 01:59:00 0 380
Andhra Pradesh
రైతులంతా అపామ్స్ 2.0 మొబైల్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి: జేడీ విజయకుమార్
రైతులు అందరూ అపామ్స్ 2.0 (APAMS 2.0) మొబైల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తమ పంటల...
By Ratna Sekhar 2026-03-08 17:32:54 0 1K
Kerala
Kerala Tourism Growth Through Sustainable Policies
Kerala is advancing tourism development through sustainable policies that balance economic growth...
By Fathima Safa 2026-06-17 11:23:31 0 203
Andhra Pradesh
మదనపల్లె: ఘనంగా ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ.
మదనపల్లె పట్టణంలోని నిమ్మనపల్లె సర్కిల్‌లో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే షాజహాన్...
By Pagadala Venkateswar 2026-06-20 04:32:44 0 113
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com