ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు కిక్కెక్కించాయి. నూతన సంవత్సర.

0
233

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు కిక్కెక్కించాయి. నూతన సంవత్సర వేడుకలతో పాటుగా పండుగ సీజన్ కావటంతో డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి. ఏపీ ఎక్సైజ్ శాఖ తాజా గణాంకాల ప్రకారం.. 2024 డిసెంబర్ నెలతో పోలిస్తే 2025 డిసెంబర్ నెలలో ఏపీలో మద్యం అమ్మకాలు 8 శాతం అధికంగా నమోదయ్యాయి. 2025 డిసెంబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ 31 వరకూ ఏపీలో రూ.2.767 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. అదే 2024 డిసెంబర్ నెల విషయానికి వస్తే రూ. 2,568 కోట్ల విలువైన లిక్కర్ అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ లెక్కలు చెప్తున్నాయి.

2025 డిసెంబర్ నెలకు సంబంధించి ఆఖరి మూడు రోజులు ఏపీలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డులను నమోదు చేశాయి. ఈ మూడ్రోజుల్లోనే సుమారుగా 543 కోట్ల విలువైన మద్యాన్ని మందుబాబులు గుటకాయ స్వాహా అనిపించారు. 2024 డిసెంబర్ నెలలో ఆఖరి మూడు రోజులు ( డిసెంబర్ 29,30,31) రూ.336 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. అప్పటితో పోల్చితే 2025 ఏడాదిలో ఆఖరి మూడు రోజులలో మద్యం అమ్మకాలు ఏకంగా 60 శాతం పెరిగినట్లు తెలిసింది.

మద్యం అమ్మకాలు పెరగడానికి కారణాలు..

మరోవైపు ఏడాది చివరి మూడు రోజులు మద్యం అమ్మకాలు ఈ స్థాయిలో నమోదు కావటానికి న్యూఇయర్ వేడుకలు, ప్రైవేట్ పార్టీలతో పాటుగా మద్యం అమ్మకాల సమయాన్ని పొడిగించటం కూడా కారణమని అధికారులు చెప్తున్నారు. దీంతో బార్లు, రెస్టారెంట్ల వద్ద భారీగా లిక్కర్ సేల్స్ జరిగినట్లు చెప్తున్నారు

ఆ జిల్లా టాప్.. ఆఖర్లో ఈ జిల్లా..

మరోవైపు మద్యం అమ్మకాల్లో విశాఖపట్నం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. డిసెంబర్ నెలలో విశాఖ జిల్లాలో రూ.178.6 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఇక రెండో స్థానంలో ఆధ్మాత్మిక ప్రాంతం తిరుపతి ఉండటం గమనార్హం. తిరుపతి జిల్లాలో రూ.169.4 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి.

రూ.155.4 కోట్లతో ఎన్టీఆర్ జిల్లా మూడో స్థానంలో ఉంది. ఇక రూ.30.7 కోట్ల విలువైన లిక్కర్ అమ్మకాలతో అల్లూరి సీతారామరాజు జిల్లా ఆఖరి స్థానంలో ఉంది. అంతకంటే ముందు స్థానంలో రూ. 35.4 కోట్లతో పార్వతీపురం మన్యం జిల్లా ఉంది. ఇక రూ.65 కోట్ల విలువైన మద్యం అమ్మకాలతో శ్రీసత్యసాయి జిల్లా ఆఖరి నుంచి మూడో స్థానంలో నిలిచినట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు వెల్లడించాయి.

Search
Categories
Read More
SURAKSHA
"Beyond the Badge: The Unwavering Resolve of SP P. Jagadeesh"
The Sentinel of Anantapur: IPS P. Jagadeesh and His Mission for a Safer Tomorrow Sub Headline:...
By Kalaga Sailaja 2026-07-14 05:02:49 0 223
Telangana
హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్‌కు ప్రభుత్వం గుడ్ న్యూస్ !
రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు, మౌలిక సదుపాయాల కల్పనలో భూములను కోల్పోయిన వారికి సరైన...
By Ponnala Srinivasrao 2026-03-24 02:18:32 0 224
Andhra Pradesh
అపూర్వం ఆదర్శనీయం పండిత రాంప్రసాద్ బిస్మిల్ ఆస్మా కుల్లాహ్ కాన్ల స్నేహబంధం
ఆంగ్లేయుల చే 1927 డిసెంబర్ 19 న ఉరితీయబడిన " పండిత రాంప్రసాద్ బిస్మిల్ - అష్ఫాఖుల్లాహ్ ఖాన్ "ల...
By Rajini Kumari 2025-12-18 08:16:17 0 230
Telangana
ఇకపై ఇంటి వద్ద నుంచే ఫిర్యాదులు: తెలంగాణ పోలీస్ శాఖ* 
*ఇకపై ఇంటి వద్ద నుంచే ఫిర్యాదులు: తెలంగాణ పోలీస్ శాఖ*    భారత్ అవాజ్ న్యూస్......
By Vanmoj Suryamohan 2026-01-20 17:15:21 0 571
Andhra Pradesh
ప్రాథమిక సహకార సంఘం ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సంఘం జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు
ప్రాథమిక సహకార సంఘం ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సంఘం జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్...
By Kothuru Murali 2026-01-08 12:27:48 0 361
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com