ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైయస్సార్ నేతృత్వం లో జాతీయ ఉపాధి

0
145

BREAKING

 

విజయవాడ 

 

*వైఎస్ షర్మిలా రెడ్డి*

APCC చీఫ్ 

 

- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి YSR నేతృత్వంలో జాతీయ ఉపాధి హామీ(MGNREGA) చట్టానికి బీజం పడింది రాష్ట్రంలోనే.

 

- ⁠మహానేత ఒత్తిడితో 2006 లో ఉపాధికి శ్రీకారం చుట్టింది ఏపీలోనే . 

 

- దివంగత ముఖ్యమంత్రి YSR సారథ్యంలో నరేగా చట్టం ఆనాడు రాష్ట్రంలో అద్భుత విజయం. 

 

- పనికి ఆహార పథకం అమలులో అప్పుడు YSR పాలన దేశానికే ఆదర్శం. 

 

- కరువు పని సక్సెస్ లో నాడు ఏపీ రోల్ మోడల్. 

 

- ఉమ్మడి రాష్ట్ర గ్రామీణ ప్రాంత అభివృద్ధికి, బ్రతుకు జీవనాన్ని గ్యారెంటీ చేయడానికి, 

 

- వలసలు నివారించి పేదల కొనుగోలు శక్తి పెంచడానికి, వ్యవసాయానికి సాయంగా,

 

- YSR గారి రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి ఆశయాలకు ఊతం ఇచ్చిందే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. 

 

- 2006 నుంచి నేటి వరకు 20 ఏళ్లలో రాష్ట్రానికి లక్ష కోట్లు వచ్చాయంటే, 

 

- ఏడాదికి కోటి మందికి ప్రత్యక్షంగా పని గ్యారెంటీ అయ్యిందంటే కాంగ్రెస్ తెచ్చిన నరేగా చట్టం పుణ్యమే.

 

- ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచిన దేశ ద్రోహి ప్రధాని మోడీ గారు. 

 

- పట్టెడన్నం పెట్టే కరువు పనిపై కుట్రలు చేశారు. 

 

- చట్టాన్ని మార్చి ఉపాధి హామీలో ఊపిరి తీశారు. 

 

- మోడీ గారు తెచ్చిన కొత్త చట్టం ఉపాధి హామీలో ఉపాధి లేనట్లే. 

 

- కాంగ్రెస్ అమలు చేసిన నరేగా పథకానికి, బీజేపీ తెచ్చిన జీ రామ్ జీ చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. 

 

- వీబీ జీ రామ్ జీ ఒక నల్లచట్టం. పేదల పొట్టకొట్టిన చట్టం. 

 

- ఉపాధిని హక్కుగా తీసేసి కేంద్రమే దిక్కుగా మార్చిన అక్రమ చట్టం. 

 

- రాష్ట్రాల మీద ఆర్థిక భారం మోపి,గ్రామస్వరాజ్యం వినాశనమే ధ్యేయంగా మోడీ గారు చేస్తున్నది నీచపు పాలన.

 

- నరేగా చట్టంలో 100 రోజుల ఉపాధి ఒక హక్కు. 

 

- ఏ గ్రామంలోనైనా,ఏ సీజన్ లోనైనా పని కోరే హక్కు ప్రజలది. 

 

- పనుల తీరు నిర్ణయాధికారం గ్రామసభలది. 

 

- 100 రోజుల పనికి ఇచ్చే వేతనాలు పూర్తిగా కేంద్రానివే. 

 

- వీబీ జీ రామ్ జీ చట్టంలో పనులు గ్రామసభ కాకుండా డిల్లీ సభ నిర్ణయిస్తుందట. 

 

- ఇదెక్కడి న్యాయం..ఇదేం చట్టం ? అన్ని గ్రామాల్లో కాకుండా ఎంపిక చేసిన ప్రాంతాల్లో పని కల్పిస్తారా? 

 

- ఒకరికి అన్నం పెట్టి మరొకరికి సున్నం పెడతారా ? ఏడాదికి 60 రోజులు పని బంద్ పెట్టడం ఇదేం నియంత చట్టం ? 

 

- 40 శాతం రాష్ట్రాలు నిధులు ఇవ్వకపోతే ఉపాధి ఎలా దక్కుతుంది ? 

 

- కేంద్రం ఇచ్చే నిధుల ఆధారంగా పనులు పరిమితం చేయడమంటే ప్రజలను పరిమితం చేస్తున్నట్లు కాదా ? 

 

- గ్రామ ఆస్తుల్లో కాకుండా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం అంటే కార్పొరేట్ వ్యవస్థలను పోషిస్తున్నట్లు అవ్వదా ?

 

- మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్. 

 

- AICC పిలుపు మేరకు, దివంగత ముఖ్యమంత్రి YSR ఆశయ సాధనను కాపాడేందుకు..

 

- APCC ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసనలకు శ్రీకారం చుడుతున్నాం. 

 

 

- కలిసి వచ్చే పార్టీలు, ప్రజా సంఘాలు,రైతు సంఘాలను కలుపుకొని అన్ని జిల్లాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. 

 

- వీబీ జీ రామ్ జీ అక్రమ చట్టాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలి. 

 

- మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి అమలు పరచాలి.

Search
Categories
Read More
Andhra Pradesh
గిట్టుబాటు ధర లేక కంది రైతుల విలవిల: వైసీపీ.
గిట్టుబాటు ధర లేక రాష్ట్రంలో కంది రైతులు విలవిలలాడుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం....
By John Baji 2025-12-29 13:59:39 0 132
Telangana
ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మహాత్మా గాంధీ...
By Sidhu Maroju 2025-12-17 15:02:46 0 174
Andhra Pradesh
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 1 to 1 సమావేశాలు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ Pawan Kalyan గారు ఈ రోజు పార్టీ ఎమ్మెల్యేలతో...
By Rajini Kumari 2025-12-19 11:01:06 0 149
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com