ఉరుసు మహోత్సవాల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాద్ వసంత కృష్ణ ప్రసాద్ తదితరులు

0
202

*ప్ర‌చుర‌ణార్థం* *30-12-2025*

 

 

షాబుఖారి బాబా దర్గా మహోన్నతమైనది : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)

 క‌లిసి ఉరుసు మహోత్సవాల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే వ‌సంత 

 

 

ఇబ్రహీంపట్నం: కుల, మతాలకు అతీతంగా నిర్వహించే షాబుఖారి బాబా దర్గా ఉరుసు ఎంతో మహోన్నతమైనదని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. కొండపల్లిలొని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా దర్గా 429 వ ఉరుసు మహోత్సవాలకు మంగ‌ళ‌వారం ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, కొండ‌ప‌ల్లి మున్సిప‌ల్ చైర్మ‌న్, టిడిపి జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చెన్నుబోయిన చిట్టిబాబు ల‌తో కలిసి పాల్గొన్నారు. ఉరుసు మహోత్సవ కమిటీ చైర్మన్ అల్తాఫ్ బాబా వారిని సాదరంగా ఆహ్వానించి ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఘనంగా సన్మానించారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి బాబా ఆశీస్సులు పొందారు. ఆ త‌ర్వాత భ‌క్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. 

 

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఎంతో పురాతన చరిత్ర కలిగిన షాబుఖారీ బాబా దర్గా ఉరుసు మహోత్సవంలో పాల్గొనటం చాలా ఆనందంగా వుందన్నారు. ఉరుసు మహోత్సవానికి ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో కొండ‌ప‌ల్లి మున్సిపాలిటీ స‌హ‌కారంతో భ‌క్తుల ఏటువంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేశారని ప్రశంసించారు. ప్రతిరోజు భక్తులందరికీ అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్య‌క్ర‌మం టిడిపి కార్య‌నిర్వ‌హ‌క కార్య‌ద‌ర్శి జంపాల సీతారామ‌య్య‌, మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జ్ అక్క‌ల గాంధీ, టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పైజాన్ ల‌తోపాటు ఎన్డీయే కూట‌మి నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో స్వల్ప సవరణలు చేసిన ప్రభుత్వం
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో స్వల్ప సవరణలు చేసిన ప్రభుత్వం. హోలీ, రంజాన్ పండుగలు కారణంగా...
By SivaNagendra Annapareddy 2025-12-20 05:17:55 0 281
Telangana
Pradhan's Exit .... What's Next.?
Hyderabad, July 25: The resignation of Union Education Minister Dharmendra Pradhan has emerged as...
By Sidhu Maroju 2026-07-25 13:36:59 0 137
Andhra Pradesh
పుంగునూరు: బోయకొండ గంగమ్మ సేవలో హైకోర్టు న్యాయమూర్తులు
అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలంలోని దిగువపల్లి గ్రామములో ఉన్న బోయకొండ గంగమ్మ దేవస్థానాన్ని...
By Kothuru Murali 2026-06-28 18:10:47 0 176
Andhra Pradesh
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్
బొబ్బిలి మండలం అలజంగి వేగావతి నది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను రెవెన్యూ...
By Boiena Rajesh 2026-08-31 08:20:42 0 123
Andhra Pradesh
పుంగనూరులో కొనసాగుతున్న దళిత సంఘాల నిరసన
పుంగనూరు తహసిల్దార్ కార్యాలయం ఆవరణంలో మూడో రోజు శుక్రవారం దళిత సంఘాల నిరసన కొనసాగింది. మాల...
By Kothuru Murali 2026-02-28 10:28:09 0 174
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com