ఏపీ దేవాదాయ శాఖ సలహాదారుగా చుండూరి నియామకం

0
295

ఏపీ దేవాదాయ శాఖ సలహాదారుగా చుండూరి నియామకం

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన చుండూరి సీతారామాంజనేయ ప్రసాద్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.

ఒంగోలులో జన్మించి, అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసిన సీతారామాంజనేయ ప్రసాద్ చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక భావాలతో పెరిగారు. యువకుడిగా ఉన్నప్పుడే అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ గుర్తింపు పొందారు.

2014–19 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖ పరిధిలోని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ (హెచ్‌డీపీటీ) చైర్మన్‌గా ఆయన సేవలందించారు. ఆ సమయంలో రాష్ట్రంలోని అనేక దేవాలయాల జీర్ణోద్ధరణ చేపట్టడంతో పాటు, పలు ప్రాంతాల్లో కోటి దీపోత్సవం, దశ సహస్ర సువాసినీ పూజ వంటి విశిష్ట కార్యక్రమాలను నిర్వహించారు.

హిందూ ధర్మ ప్రచార లక్ష్యంతో ‘ధర్మ శంఖారావం’ అనే మాసపత్రికను కూడా ఆయన ప్రారంభించారు. అదేవిధంగా ఒంగోలు పట్టణంలో ‘గాయత్రి పరివార్’ పేరుతో సంస్థను స్థాపించి, అనేక మంది యువతను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్నారు. ఆయన కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. ఉచిత అన్నదానం, ఉచిత హోమియో వైద్యసేవల వంటి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

 

#నరేంద్ర

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రపంచం లోనే ప్రజా స్వామ్య దేశం భారత్
స్పెషల్ ఇన్వెస్ట్ గేషన్ రివి జన్ నియమావళి ప్రకారం 1952 సంవత్సరం నుండి బార తా వని లో21 సంవత్సరం...
By Mobbu Venkatramana 2026-01-31 11:51:23 0 541
Andhra Pradesh
మదనపల్లి: మాయల మరాఠీ గ్యాంగ్‌పై ఎమ్మెల్యేకు ఫిర్యాదు.
ఆడవేషాలు వేసుకుని అమాయకులను మోసం చేస్తున్న మాయల మరాఠీ గ్యాంగ్ నాయకుడు మోహన్ కృష్ణమ నాయుడిపై...
By Pagadala Venkateswar 2026-06-15 06:34:52 0 96
Telangana
"అల్వాల్‌లో యువతి మిస్సింగ్.. ప్రియుడిపైనే తల్లి అనుమానం.?
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మచ్చ బొల్లారం స్రవంతి నగర్‌లో...
By Sidhu Maroju 2026-05-21 13:40:23 0 282
Telangana
వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ కి వినతి
 మంచిర్యాల : తెలంగాణ మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయు) ఆధ్వర్యంలో రాష్ట్ర...
By Avunoori Mahesh 2026-09-03 11:47:34 0 114
Puducherry
Puducherry Strengthens Rural Development and Panchayats
Puducherry continues to promote rural development in 2026 by strengthening Panchayati Raj...
By Fathima Safa 2026-07-04 13:22:55 0 113
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com