ఆంధ్రప్రదేశ్‌లోని గ్రూప్ -2 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్

0
174

 గ్రూప్ -2 రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra pradesh High Court) కొట్టివేసింది. గ్రూప్ -2 రిజర్వేషన్లకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు మంగళవారం రోజు తీర్పు ఇచ్చింది. 2023 గ్రూప్ -2కు సంబంధించి రిజర్వేషన్ పాయింట్లను సవాల్ చేస్తూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. గ్రూప్-2 నోటిఫికేషన్ రద్దు (AP Group - 2 Notification) చేయాలని పిటిషన్‌లో కోరారు

అలాగే సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు మేరకు రిజర్వేషన్ రోస్టర్ పాటించాలని.. 2023 గ్రూప్ 2 నోటిఫికేషన్ రద్దు చేసి.. కొత్త నోటిఫికేషన్ ఇచ్చేలా న్యాయస్థానం అధికారులను ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. అన్ని పిటిషన్లు కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది.

మరోవైపు గ్రూప్ -2 మెయిన్స్ పరీక్షలు ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగాయి. అయితే మెయిన్స్ పరీక్షల నిర్వహణను ఆపాలంటూ అప్పట్లోనూ కొంతమంది పిటిషన్లు వేశారు. అయితే హైకోర్టు నిరాకరించరింది. పరీక్షను నిలిపివేస్తే అర్హులైన అభ్యర్థుల ప్రయోజనాలకు ఇబ్బంది కలుగుతుందని అభిప్రాయపడింది. అలాగే గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ ఆధారంగా.. తదుపరి చర్యలన్నీ తమ తీర్పునకు లోబడే ఉంటాయని అప్పట్లో స్పష్టం చేసింది. మరోవైపు గ్రూప్ 2 మెయిన్ పరీక్షలకు 92 వేల 250 మంది అర్హత సాధించారు. అయితే హారిజాంటల్‌ రిజర్వేషన్‌ మీద కొంతమంది అభ్యంతరం తెలిపారు.

ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టును ఆశ్రయించిన వారిలో గ్రూప్ 2 మెయిన్ పరీక్షకు అర్హత సాధించింది ఇద్దరే. దీంతో గ్రూప్ 2 మెయిన్ పరీక్షను ఆపేస్తే మిగతా అర్హులైన అభ్యర్థులకు నష్టం జరుగుతుందంటూ మెయిన్ పరీక్షను నిలిపివేసేందుకు ఏపీ హైకోర్టు అప్పట్లో నిరాకరించింది. తాజాగా గ్రూప్ 2 రిజర్వేషన్లపై దాఖలైన అన్ని పిటిషన్లను కూడా ఏపీ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేయడంతో.. గ్రూప్ 2 అభ్యర్థులకు ఊరట లభించనుంది.

Search
Categories
Read More
Telangana
మల్కాజ్ గిరి డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు
   మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / మల్కాజ్ గిరి.   మల్కాజ్ గిరి కార్పొరేటర్...
By Sidhu Maroju 2025-07-23 16:39:39 0 992
Business & Finance
Launch Your Indian Subsidiary with Expert Registration
Expand your global business presence by setting up an Indian subsidiary with expert registration...
By Navya Sree 2026-07-10 08:13:37 0 65
Andhra Pradesh
పేదల సేవలో భాగంగా ఈరోజు దర్శి మండలం, జముకులదిన్నె పంచాయతీలో ముందస్తుగా “ఎన్టీఆర్ భరోసా పెన్షన్” కార్యక్రమం నిర్వహించి లబ్ధిదారులకు ఇంటి వద్దకే పెన్షన్లు అందజేశారు
పేదల సేవలో భాగంగా ఈరోజు దర్శి మండలం, జముకులదిన్నె పంచాయతీలో ముందస్తుగా “ఎన్టీఆర్ భరోసా...
By Chennaiah Kati 2026-02-01 07:07:45 0 219
Andhra Pradesh
నేతాజీ జయంతికి నాయకుల ఘన నివాళి.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతిని పురస్కరించుకొని నాయకులు, ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు...
By Pagadala Venkateswar 2026-01-23 07:03:30 0 164
Telangana
NZB: ఎసి బాలూర కళాశాల హాస్టల్ (బి)వార్డెన్ సస్పెండ్
నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని నమ్దేవాడ అ ఏసి కళాశాల  బలూరా హాస్పిటల్ (బీ). వార్డెన్ యo...
By Sadaq Sadaq 2026-02-09 10:14:23 0 192
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com