చాయ్ విత్ జనసైనిక్స్' కార్యక్రమం

0
226

గుంటూరు నగరంలోని 47వ డివిజన్ స్థానిక గోరంట్ల ప్రాంతంలోని రామాలయం వద్ద జనసేన కార్పొరేటర్ యర్రంశెట్టి పద్మావతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'చాయ్ విత్ జనసైనిక్స్' కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్రాణం మార్కండేయబాబు, నాయబ్ కమల్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. 

ముందుగా 47వ వార్డులో జనసేన నాయకులతో, జనసైనికులతో కలిసి పాదయాత్రగా సందర్శించడం జరిగింది. వాడవాడలా తిరుగుతూ.. ప్రజలతో మమేకమవుతూ.. వారి నుండి స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకోవడం జరిగింది. 

అనంతరం 'చాయ్ విత్ జనసైనిక్స్' కార్యక్రమంలో స్థానికంగా ఉన్న సమస్యలు ప్రజల వద్ద నుండి, జనసైనికుల నుండు తెలుసుకోవడం జరిగింది. 47వ వార్డులో వాకింగ్ ట్రాక్, స్మశాన వాటిక, మంచి నీళ్ల ట్యాంకు, డ్రైనేజీ తదితర సమస్యలపైన ద్రుష్టి పెట్టాలని స్థానికులు వివరించారు. వెంటనే అధికారులతో మాట్లాడి తక్షణమే సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని మునిసిపల్ అధికారులకి విజ్ఞాపన చెయ్యడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ నాయకులు, నగర కమిటీ నాయకులు, వీరమహిళా విభాగం నాయకులు మరియు జనసైనికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం పై దాడి యత్నం దుర్మార్గం సుగవాసి ప్రసాద్ బాబు
హైదరాబాదులోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం పై వైసీపీ శ్రేణులు దాడికి యత్నించడం తీవ్రంగా...
By Benguluri Madhubabu 2026-04-07 12:48:40 0 248
Telangana
విద్యుత్ ఆర్టిసన్లకి సంగీభవం తెలిపిన రఘునాథ్ వెర్రబెల్లి
విద్యుత్ ఆర్టిసన్లు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ కార్మికులు గత 5 రోజులుగా...
By Avunoori Mahesh 2026-04-12 09:16:07 0 198
Andaman & Nikobar Islands
Andaman’s New Wave: Transforming Tourism with Sustainable Diving
The Andaman and Nicobar Islands are charting a new course in tourism, moving far beyond standard...
By Lokeshwari Panthadi 2026-06-29 07:02:37 0 188
Andhra Pradesh
రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం విన్నుత ఆలోచన ..
"అన్నవరం  ప్రత్తిపాడు సర్కిల్  కాకినాడ జిల్లా"   కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి...
By BABJI DADALA 2026-01-04 12:45:39 0 405
BMA
The Fourth Estate: Judiciary Validates Press Power
The true strength of the media lies in its institutional recognition as the Fourth Estate of...
By JoinBMA 2026-08-21 10:07:08 0 77
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com