దేశ సంస్కృతిని సాంప్రదాయాలు ప్రతీకగా అయోధ్య సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు

0
219

 

 

*సుపరిపాలనకు రామరాజ్యమే బెంచ్ మార్క్*

 

*దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా అయోధ్య*

 

*అయోధ్యలో శ్రీరామచంద్రణ్ని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు*

 

*అయోధ్య, డిసెంబర్ 28 :-* సుపరిపాలనకు రామరాజ్యమే బెంచ్ మార్క్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. మంచి పరిపాలనను రామరాజ్యంతోనే పోల్చుకుంటామని అన్నారు. ఆదివారం అయోధ్యలో శ్రీరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అత్యుత్తమ పాలనకు రాముడి పాలనే కొలమానంగా తీసుకుంటామని అన్నారు. అయోధ్యలో నిర్మించిన రామమందిరం మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఎన్నో వివాదాల అనంతరం ఆలయం నిర్మితమై దేశ ప్రజల కల సాకారమైందన్నారు. భారత్‌లో ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య రామాలయం మారిందని అన్నారు. ఆలయ నిర్మాణంతో పాటు యూపీలో సుపరిపాలన అందిస్తున్న యోగీ ఆదిత్య నాథ్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. దేశంలోని ఇతర దేవాలయాలకు అయోధ్య రామాలయం మార్గదర్శకంగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. సాంకేతికంగా ముందుడుగు వేస్తున్న భారత్‌ను ఎవరూ నిలువరించలేరని స్పష్టం చేశారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యంలో యూపీ, బీహార్‌లు కూడా కీలక పాత్ర పోషించాలని అన్నారు. శ్రీ రాముడి దర్శనం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్‌లో స్పందించారు. ‘శ్రీ రాముడు పాటించిన విలువలు కాలానికి అతీతంగా ఎప్పుడూ స్ఫూర్తినిస్తుంటాయి. రాముడు పాటించిన విలువలు సుపరిపాలనకు నిరంతరం మార్గదర్శంగా నిలుస్తాయి. అయోధ్యలో శ్రీరామ దర్శనం నాకు నూతన శక్తిని ఇచ్చింది’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బ్యాంకులో బంగారం మాయం చేసిన కుమారుడిపై తల్లి ఫిర్యాదు.
మదనపల్లెలో తన పేరుపై బ్యాంకులో తనఖా పెట్టిన 44.5 గ్రాముల బంగారు ఆభరణాలను, తనకు తెలియకుండా పెద్ద...
By Pagadala Venkateswar 2026-04-07 03:55:40 0 165
Andhra Pradesh
నిలకడలేని జగన్ ను సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదు: మంత్రి నారా లోకేశ్.
  నిలకడలేని జగన్ ను సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదు: మంత్రి నారా లోకేశ్ 08-04-2026 Wed...
By Pagadala Venkateswar 2026-04-09 04:51:28 0 170
Telangana
ట్రాఫిక్ నిబంధనలే ప్రాణరక్ష- పోలీసుల అవగాహనతో పెరిగిన చైతన్యం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : (భారత్ ఆవాజ్ ప్రతినిధి) ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను తూచా...
By Sidhu Maroju 2026-01-28 15:20:09 0 231
SURAKSHA
P. T. Rudra Goud: A Visionary Administrator in Governance
A distinguished IAS officer of the AGMUT cadre, P. T. Rudra Goud serves as Administrative...
By Lokeshwari Panthadi 2026-07-30 05:49:28 0 131
Bharat Aawaz
గళం మీది. వేదిక మనది.
గళం మీది. వేదిక మనది. తీరం ఒడ్డున నిలబడితే మార్పు రాదు. ప్రవాహంలో భాగమైనప్పుడే చరిత్ర...
By Bharat Aawaz 2025-07-08 18:40:45 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com