బాధితులకి నిత్యవసర సరుకులు 6 వేలు ఆర్థిక సాయం

0
225

*బాధితునికి నిత్యావసర సరుకులు, రూ.6 వేల ఆర్థిక సాయం అందజేత* 

 

*మంగళగిరి:*

గత రెండున్నరేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమైన ఓ బాధితునికి మంగళగిరి నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు డోకిపర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చేయూతనందించారు.

*చేతులెత్తి మొక్కుతున్నా.. చేయూతనివ్వరూ..!*

శీర్షికన ఈనెల 19వ తేదీన నేటి దినపత్రిక సూర్య జిల్లా టాబ్లాయిడ్ లో కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు డోకిపర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మిత్ర బృందం సోమవారం మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి కాజ లోని బాధితుడు మోదుగుల వెంకట్రావు నివాసానికి చేరుకొని పరామర్శించి నిత్యావసర సరుకులతో పాటు రూ.6వేల ఆర్థిక సహాయాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు డోకిపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ... బాధితుడు వెంకట్రావు గత రెండున్నర సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితం కావడం ఎంతో బాధాకరమన్నారు. బాధితునికి తమ వంతు సాయంగా నెలకు సరిపడా నిత్యావసర సరుకులు, రూ. ఆరు వేల ఆర్థిక సాయం అందజేయడం జరిగిందన్నారు. మరింతమంది మానవతావాదులు ముందుకు వచ్చి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. బాధితుడు వెంకట్రావుకు వికలాంగ పెన్షన్ మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బర్మా శ్రీనివాసరావు, నక్కా లక్ష్మణ్, మురుగుడు మదన్ మోహన్, మద్దాల రమేష్, చెన్నం శెట్టి సతీష్, షేక్ ఖైరుల్లా, శివాజీ తదితరులు పాల్గొన్నారు. 

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
ఎమ్మిగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో
ఎమ్మిగనూరు: రైతుల సమస్యల పరిష్కారం, ముఖ్యంగా ఖరీఫ్ సీజన్‌లో పంటలకు అవసరమైన సాగునీటిని వెంటనే...
By Boya Dasthagiri 2026-08-21 10:40:13 0 162
Andhra Pradesh
Satya Kumar Yadav: మంత్రి సత్యకుమార్ చొరవ.. యువకుడికి గుండె మార్పిడితో కొత్త జీవితం.
మంత్రి సత్యకుమార్ చొరవతో కదిరి యువకుడికి విజయవంతంగా గుండె మార్పిడి బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి...
By Pagadala Venkateswar 2026-02-24 10:49:13 0 199
Andhra Pradesh
ప్లాస్టిక్ రహిత ఆంధ్ర ప్రదేశ్ నిర్మిద్దాం గద్దె రామ్మోహన్
విజయవాడ నగరపాలక సంస్థ  16-05-2026        *ప్లాస్టిక్ రహిత ఆంధ్ర...
By Rajini Kumari 2026-05-16 14:39:10 0 172
Andhra Pradesh
Madanapalle: మదనపల్లెను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించి నెలలు గడుస్తున్నా జిల్లా స్థాయి కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేయకపోవడంపై కుమార్ తీవ్ర ఆగ్రహం.
Madanapalle: అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లెను ప్రకటించి దాదాపు తొమ్మిది నెలలు గడిచినా,...
By Pagadala Venkateswar 2026-08-08 05:21:26 0 91
Telangana
నీ పేరు కేసీఆర్ అయితే చర్చకు రా..సీఎం రేవంత్ రెడ్డి
మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ 10...
By Ponnala Srinivasrao 2026-06-07 00:54:43 0 156
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com