Madanapalle: మదనపల్లెను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించి నెలలు గడుస్తున్నా జిల్లా స్థాయి కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేయకపోవడంపై కుమార్ తీవ్ర ఆగ్రహం.

0
88

Madanapalle: అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లెను ప్రకటించి దాదాపు తొమ్మిది నెలలు గడిచినా, ఇప్పటికీ అనేక జిల్లా స్థాయి కార్యాలయాలు పూర్తిస్థాయిలో మదనపల్లెలో పనిచేయకపోవడం విచారకరమని బహుజన యువసేన (BYS) రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ కుమార్ అన్నారు. శుక్రవారం బహుజన యువసేన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ జిల్లా కార్యాలయం ఇప్పటికీ రాయచోటిలోనే కొనసాగుతోందని, ఆర్టీఓ జిల్లా కార్యాలయాన్ని కూడా రాయచోటికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

 

అలాగే బీసీ హాస్టల్‌ను కూడా రాయచోటికి తరలించే చర్యలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. జిల్లాకు సంబంధించిన దాదాపు 20 నుంచి 25 కార్యాలయాలు ఇంకా మదనపల్లెలో ఏర్పాటు కాకపోవడం ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తోందన్నారు. మదనపల్లెలో ఉన్న కొన్ని జిల్లా కార్యాలయాలకు అధికారులు ప్రతిరోజూ హాజరుకాకుండా వారానికి ఒకసారి మాత్రమే వస్తుండగా, మరికొందరు అధికారులు రాయచోటిలోనే విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ప్రజల్లో అసంతృప్తిని పెంచుతున్నాయని చెప్పారు.

 

జిల్లా కేంద్రంగా మదనపల్లెను ప్రకటించినప్పుడు పరిపాలనా వికేంద్రీకరణ లక్ష్యంగా చెప్పారని, అయితే జిల్లా స్థాయి కార్యాలయాలు మదనపల్లెలో లేకపోవడం వల్ల జిల్లా కేంద్ర హోదా లక్ష్యం నెరవేరడం లేదన్నారు. మదనపల్లెలోనే అన్ని జిల్లా స్థాయి కార్యాలయాలను ఏర్పాటు చేసి, అధికారులు క్రమం తప్పకుండా విధులకు హాజరయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని పునీత్ కుమార్ డిమాండ్ చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏప్రిల్ 11న జ్యోతీరావ్ ఫులె జయంతి నిర్వహణ
ప్రభుత్వ ఆదేశాల మేరకు మహాత్మ జ్యోతిరావు ఫులె 200వ జయంతి కార్యక్రమాన్ని ఏప్రిల్ 11న ఉదయం 10 గంటలకు...
By Boiena Rajesh 2026-04-10 01:02:38 0 189
Telangana
నివాస ప్రాంతాలలో వైన్స్ షాప్ లు వద్దు : ఎమ్మెల్యే కు వినతి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  బోయిన్ పల్లి ప్రాంతంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏరియాలో , మరియు...
By Sidhu Maroju 2025-11-27 10:59:09 0 228
Andhra Pradesh
జనసేన నాయకుల ప్రశంసలు: రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమంపై ప్రశంసల జల్లు.
తిరుపతిలో జరిగిన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో జనసేన...
By Pagadala Venkateswar 2026-06-12 14:19:20 0 119
Telangana
నిజామాబాద్
వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని డివిజన్లోని పలు సమస్యలను పరిష్కరించమని, గౌరవ కమిషనర్ గారిని కలవడం...
By Sadaq Sadaq 2026-06-03 14:16:41 0 170
Andhra Pradesh
స్వచ్ఛాంధ్రపై సీఎం చంద్రబాబు సమీక్ష... అధికారులకు కీలక ఆదేశాలు.
  స్వచ్ఛాంధ్రపై సీఎం చంద్రబాబు సమీక్ష... అధికారులకు కీలక ఆదేశాలు. Andhra Chandrababu...
By Pagadala Venkateswar 2026-04-18 04:12:29 0 145
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com