హజ్రత్ సయ్యద్ షాబుకారీ బాబా ఉరుసు ఏర్పాట్లను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు

0
267

*ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ*

 

*పత్రికా ప్రకటన* *తేది.26-12-2025*

 

*హజరత్ సయ్యద్ షా బుఖారి బాబా ఉరుసు మహోత్సవం సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు*

 

ఎన్.టి.ఆర్.జిల్లా, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిది, కొండపల్లి పట్టణ పరిధిలో ఈ నెల 29 వ తేదీ నుండి 31 వ తేదీ వరకు నిర్వహించు హజరత్ సయ్యద్ షా బుఖారి బాబా దర్గా 429వ ఉరుసు మహోత్సవ కార్యక్రమం సందర్బంగా ఆదిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నేపధ్యంలో కొండపల్లి మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు చేస్తున్న ఏర్పాట్లను ఈ రోజు నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు ఇతర అధికారులతో కలిసి పరిశీలించినారు.

 

ఈ నేపధ్యంలో ముందుగా నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు దర్గాలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. అనంతరం కొండపల్లి మరియు పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి అదికారులకు మరియు నిర్వాహకులకు పలు సూచనలు మరియు సలహాలను అంధించారు. పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. గంధం సమర్పించే సమయంలో భక్తుల రద్దీ దృష్ట్యా బందోబస్తు నిర్వహించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులకు సూచించారు.

 

ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ గారు, పశ్చిమ జోన్ ఏ.డి.సి.పి. శ్రీ గుణ్ణం రామకృష్ణ గారు, పశ్చిమ ఏ.సి.పి. శ్రీ దుర్గారావు గారు, ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్ శ్రీ చంద్రశేఖర్ గారు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ‌

* * *

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:బార్ కౌన్సిల్ సభ్యుడికి ఘన సన్మానం
పుంగనూరు పట్టణానికి బార్ కౌన్సిల్ మెంబర్ గా గెలుపొందిన ఉప్పలపాటి శ్రీనివాసరాజును గురువారం...
By Kothuru Murali 2026-04-10 04:39:18 0 132
Andhra Pradesh
యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి: కలెక్టర్.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మదనపల్లిలోని మిషన్ కాంపౌండ్ మైదానంలో...
By Pagadala Venkateswar 2026-06-21 07:41:25 0 102
Andhra Pradesh
నేడు శంబర పోలమాంబ చివరి వారం జాతర
ఉత్తరాంధ్ర గిరిజనుల ఆరాధ్య దేవత, రాష్ట్ర పండగగా గుర్తింపు పొందిన శంబర పోలమాంబ అమ్మవారి జాతర...
By Boiena Rajesh 2026-03-31 07:55:08 0 245
Andhra Pradesh
Madanapalle:మదనపల్లె వివేకానంద పాఠశాలలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తూ టీడీపీ ఇంచార్జ్ మధుసూదన్ రెడ్డి ప్రతిరోజూ నీటి ట్యాంకర్ పంపేలా ఏర్పాట్లు చేశారు.
Madanapalle: మదనపల్లె పట్టణంలోని రామిరెడ్డి లేఔట్‌లో ఉన్న వివేకానంద పాఠశాలలో తాగునీటి కొరత...
By Pagadala Venkateswar 2026-07-30 14:07:37 0 87
SURAKSHA
మహిళా వేధింపులను అరికట్టేందుకు షీ టీమ్స్ నిరంతర గస్తీ
మహిళల భద్రతే ధ్యేయంగా తెలంగాణ పోలీస్ విభాగం ప్రవేశపెట్టిన 'షీ టీమ్స్' (SHE Teams) నిరంతరం...
By Kalaga Sailaja 2026-06-29 05:45:34 0 90
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com