గుంటూరు కలెక్టర్ విద్యా ప్రమాణాల మెరుగుకు (మన బడి- మన బాధ్యత).

0
246

 విద్యా ప్రమాణాలు మెరుగుకు "మన బడి - మన బాధ్యత"* గుంటూరు, డిసెంబరు 24 : పాఠశాల విద్యా ప్రమాణాలు మెరుగుకు గుంటూరు జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమం ప్రారంభించింది. ముఖ్యంగా తొమ్మిది, పదవ తరగతి విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి, ఉన్నత విద్యా, ఉద్యోగ అవకాశాలు పట్ల అవగాహన కల్పించడం తద్వారా పది పరీక్షలలో శత శాతం ఫలితాలు సాధించడం లక్ష్యంగా "మన బడి - మన బాధ్యత" కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో గల 185 ఉన్నత పాఠశాలలకు జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించి ఆయా పాఠశాలల పర్యవేక్షణ చేయుటకు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఉత్తర్వులు జారీ చేశారు. తొమ్మిది, పది విద్యార్థుల్లో మానసిక ఆందోళన తగ్గించడం, చదువు పట్ల ఏకాగ్రత కలిగించడం, విద్యార్థులు ఏ సబ్జెక్టులలో వెనుకబడి ఉన్నారో గుర్తించి వాటిలో మంచి తర్ఫీదు ఇవ్వడం, అందులో ఉన్న భయం పోగొట్టడం, అదే సబ్జెక్టులో ఉన్నత విద్య అభ్యసించి అందులో నిపుణులుగా తయారు అయ్యే విధంగా మలచడం వంటి అంశాలు పట్ల దృష్టి సారించారు. విద్యార్థులకు ప్రత్యేక అధికారులు మార్గదర్శిగా, కౌన్సిలింగ్ అందించడం చేస్తారు. వివిధ రంగాల్లో విజయాలు సాధించిన వ్యక్తుల జీవిత చరిత్రలు తెలియజేస్తూ ప్రేరణ కలిగించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మాట్లాడుతూ విద్యార్థులు సరైన అవగాహన లేక అనేక అవకాశాలు చేజార్చుకుంటున్నారన్నారు. విద్యార్థులకు మంచి మార్గదర్శకత్వం, సూచనలు, సలహాలు, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు అందించడం వలన భవిష్యత్తుకు గట్టి పునాది పడుతుందన్నారు. అందుకే  "మన బడి - మన బాధ్యత" కార్యక్రమాన్ని అమలు చేస్తూ జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించామని అన్నారు. అధికారులు స్వీయ అనుభవాలు కూడా విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంచడం, మానసిక స్థైర్యం తీసుకురావడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Himachal Pradesh
Hydropower Projects and Renewable Energy Growth Drive
Himachal Pradesh is accelerating its clean energy transition through the expansion of hydropower...
By Fathima Safa 2026-06-22 11:05:31 0 89
Telangana
ఇధి లేబర్ అడ్డా ! పని దొరుకుతే పండుగే
దిండిగల్, గ‎త కొన్ని నెలలు గా రాష్టం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను బట్టి రియల్ ఎస్టేట్...
By Ponnala Srinivasrao 2026-03-06 06:06:14 0 411
Andhra Pradesh
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ: చందర్లపాడు మండలం,చింతలపాడు గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్ లో 1994-97...
By Patan Khuddus 2026-05-11 09:51:09 0 253
Andhra Pradesh
ఎస్ఎస్సి పరీక్షలు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు
*SSC పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు APSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం*    •...
By Rajini Kumari 2026-03-10 09:17:21 0 176
Andhra Pradesh
కర్నూలు మెడికల్ కాలేజీ అభివృద్ధి సమావేశంలో పాల్గొన్న మంత్రి !!
కర్నూలు :   కర్నూలు మెడికల్ కళాశాలలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి మరియు మెడికల్ కాలేజ్ అభివృద్ధి...
By Hari Krishna 2025-12-26 16:24:41 0 229
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com