తండాలో ఉద్రిక్తత : ఇద్దరు పోలీసులకు గాయాలు

0
338

మహబూబాబాద్, డిసెంబర్.24(భారత్ అవాజ్): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచ్యా తండాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిన్న తండాలో జరిగిన వీరన్న హత్యకు ప్రతీకారంగా మృతుడి బంధువులు అనుమానితుల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. వీరన్న హత్యకు కారకులుగా అనుమానిస్తున్న తండాకు చెందిన RMP వైద్యుడు భరత్, బాలు ఇళ్లపై దాడులు చేశారు.  భరత్ కు  చెందిన బైక్, కిరాణా షాప్ను మృతుడి బంధువులు దగ్ధం చేశారు. మరో అనుమానితుడు బాలు ఇంటిని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తండా వాసులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని తోపులాటకు దారితీసింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు తండాలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Search
Categories
Read More
Telangana
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ రావు అరెస్ట్
  అమరావతి మహిళలను కించపరిచిన కేసులో అరెస్ట్ చేసిన ఏపీ తుళ్లూరు పోలీసులు హైదరాబాద్‌లో...
By Sidhu Maroju 2025-06-09 10:26:55 0 1K
Andhra Pradesh
వైసీపీ ర్యాలీకు అనుమతులు లేవు: సీఐ
బొబ్బిలి పట్టణంలో వైసీపీ ర్యాలీ, ధర్నాకు ఎటువంటి అనుమతులు లేవని బొబ్బలి పట్టణ సీఐ కె.నారాయణరావు...
By Boiena Rajesh 2026-08-10 09:16:46 0 120
Andhra Pradesh
చందోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు వైద్యం అందని ద్రాక్షగా మారింది......
చందోలు:  చందోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారులు మాయాజాలం. చందోలు ప్రాథమిక ఆరోగ్య...
By Gadiyapudi Narendra 2026-02-12 12:49:39 0 225
Tamilnadu
Education Reforms and Digital Learning in Tamil Nadu
Tamil Nadu is enhancing its education system through reforms focused on quality learning, digital...
By Fathima Safa 2026-06-20 06:36:32 0 212
Telangana
గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులైన  నీలం స్వరూప కుమారుడు క్రాంతి నూతన...
By Pindikura Mahesh 2026-06-26 03:06:35 0 426
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com