ప్రభుత్వ సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం విద్య ద్వారానే వ్యక్తి జీవితంలో మార్పులు... కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి.

0
206

మెదక్ జిల్లా చేగుంట మండలంలోని రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, విద్య ద్వారానే వ్యక్తులలో సమూల మార్పులు జరుగుతాయి అన్నారు.చేగుంట గ్రామపంచాయతీకి కొత్త భవనం,చేగుంట మండలానికి డిగ్రీ కళాశాల మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. మొత్తం 38 మందికి గాను 3,804,408 రూపాయల చెక్కులను లబ్దిదారులకు అందించారు.రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలైతున్నాయి అన్నారు.అర్హత గల వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు.ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు త్వరిత గతిన నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు.వచ్చే సంవత్సరానికి నియోజకవర్గానికి మరో 3,500 ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా 17 లక్షల ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుందన్నారు.పోయిన విద్యా సంవత్సరానికి 50,000 మంది టీచర్లను భర్తీ చేశామని కొత్త రేషన్ కార్డులు 200 యూనిట్ల కరెంటు సన్న బియ్యం లాంటి మహత్తర కార్యక్రమాల అమలైతున్నై అన్నారు.పింఛన్ల పెంపు విషయంలో ముఖ్యమంత్రి తో నిన్న సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రేపు విజయనగరం ఎంపీ షెడ్యూల్
విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారి రేపటి షెడ్యూల్,వి జయనగరం ఎంపీ గారి...
By Mukku Ramu 2026-02-21 14:57:31 0 367
Andhra Pradesh
చీరాలలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా ముత్యాల ముగ్గుల పోటీలు
చీరాలలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా ముత్యాల ముగ్గుల పోటీలు   బాపట్ల: బాపట్ల...
By Gadiyapudi Narendra 2026-01-05 17:40:32 0 218
Andhra Pradesh
పుంగనూరు: అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి.
పుంగనూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు గురువారం అధికారుల నిర్లక్ష్య వైఖరిని...
By Kothuru Murali 2026-01-30 04:35:00 0 200
Telangana
జర్మనీ సహా విదేశాల్లో ఉద్యోగాలకు యువతను సిద్ధం చేస్తున్న టామ్కామ్: మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, మే 13: నైపుణ్యాభివృద్ధి, భాషా శిక్షణ మరియు వృత్తిపరమైన శిక్షణ ద్వారా స్థానిక యువతకు...
By Avunoori Mahesh 2026-05-13 10:27:15 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com