ఎన్టీఆర్ జిల్లా సినీ సాహిత్య సాంస్కృతిక ఆవకాయ్ ఘనంగా ఉత్సవాలు

0
238

*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌*

*ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 23, 2025*

 

*సినీ, సాహిత్య‌, సాంస్కృతిక ఆవ‌కాయ్*

- *జ‌న‌వ‌రి 8 నుంచి ప‌ది వ‌ర‌కు ఘ‌నంగా అమ‌రావ‌తోత్స‌వాలు*

- *రాష్ట్ర ప‌ర్యాట‌క రంగ అభివృద్ధిలో మ‌రో కీల‌క అడుగు*

- *మ‌న సాంస్కృతిక వైభ‌వానికి అంత‌ర్జాతీయ గుర్తింపున‌కు వీలు*

- *ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌* 

 

విజ‌య‌వాడ మ‌రో ఉత్స‌వ హేళ‌కు వేదిక కానుంద‌ని.. జ‌న‌వ‌రి 8 నుంచి 10వ తేదీ వ‌ర‌కు మూడు రోజుల పాటు ఆవ‌కాయ్ పేరుతో సినిమా, సంస్కృతి, సాహిత్యాల అమ‌రావ‌తోత్స‌వం జ‌ర‌గ‌నుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. 

మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ‌లో క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. ఏపీటీఏ డిప్యూటీ సీఈవో ఎ.శ్రీనివాస్‌, టీమ్‌వ‌ర్క్ (సెల‌బ్రేటింగ్ ది ఆర్ట్స్‌) సంస్థ ప్ర‌తినిధి సయ్యద్ శామ్స్ త‌దిత‌రుల‌తో క‌లిసి ఆవ‌కాయ్ అమ‌రావ‌తోత్స‌వం వివ‌రాల‌ను మీడియా స‌మావేశంలో వెల్ల‌డించారు. అమ‌రావ‌తిని సాంస్కృతిక సాహితీ రాజ‌ధానిగా తీర్చిదిద్దేందుకు గౌర‌వ ముఖ్య‌మంత్రి దిశానిర్దేశానికి అనుగుణంగా ఈ ఉత్సవాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. విజయవాడ పున్నమి ఘాట్, భవానీ ఐల్యాండ్‌లో నిర్వ‌హించే ఉత్స‌వాల‌కు ప్ర‌వేశం ఉచిత‌మ‌ని.. గౌర‌వ ముఖ్య‌మంత్రి ఈ ఉత్స‌వాల‌ను ప్రారంభిస్తార‌న్నారు. సినిమా, సంగీతం, సాహిత్యం, సాంస్కృతిక వైభ‌వాన్ని ఒకేవేదిక‌పైకి తెచ్చే గొప్ప ఉత్స‌వాలు ఇవ‌ని పేర్కొన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ సాంస్కృతిక వార‌స‌త్వ సంప‌ద‌కు జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు ల‌భించేలా ఈ ఉత్స‌వాల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. అమరావతిని సాహితీ, కళ‌ల రాజధానిగా మార్చేందుకు తొలిమెట్టుగా ఈ ఫెస్టివల్ ఉండనుందన్నారు. మూడు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న వేడుక‌ల్లో భాగంగా తెలుగు సినిమా మూలాలు, సాహిత్య నేపథ్యం, నేటి మార్పులపై చర్చలు, ప్రదర్శనలు కూడా ఉంటాయ‌న్నారు. సంగీత ప్ర‌ద‌ర్శ‌న‌లు, హెర్ ఫ్రేమ్స్, హెర్ ఫైర్ ప్ర‌ద‌ర్శ‌న‌లు, ది మ్యూజిక్‌, మ‌స్తీ, మ్యాజిక్, టైమ్ లెస్ టేల్స్ , ముషాయిరా ఎక్స్‌పీరియ‌న్స్ వంటి కార్య‌క్ర‌మాలుంటాయ‌న్నారు. స్థానిక క‌ళాకారుల‌ను కూడా ఈ ఉత్స‌వాల ద్వారా ప్రోత్స‌హించ‌నున్న‌ట్లు వివ‌రించారు. వారసత్వ యాత్రలు, ఘాట్ ఫెర్రీ ప్రయాణాలు, రుచికరమైన స్థానిక వంటకాలతో కూడిన ఫుడ్ ఫెస్టివల్‌ను కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. మీడియా స‌మావేశానికి ముందు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. వివిధ శాఖ‌ల అధికారులతో ఆవకాయ్ ఉత్స‌వాల‌పై స‌మ‌న్వ‌య స‌మావేశం నిర్వ‌హించారు. విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ‌, పోలీస్‌, రెవెన్యూ, వైద్య ఆరోగ్యం త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌కు ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌పై దిశానిర్దేశం చేశారు. విజ‌య‌వాడ ఉత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేసిన‌ట్లే ఆవ‌కాయ్ సినిమా, సంస్కృతి, సాహిత్యాల అమ‌రావ‌తోత్స‌వాన్ని కూడా విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపునిచ్చారు. ఇది తొలి అడుగు మాత్ర‌మేన‌ని.. ఏటా ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఏపీటీఏ డిప్యూటీ సీఈవో ఎ.శ్రీనివాస్ తెలిపారు. టీమ్‌వ‌ర్క్ సంస్థ‌కు జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో సాంస్కృతిక‌, సాహిత్య ఉత్స‌వాల‌ను నిర్వ‌హించి, విజ‌య‌వంతం చేసిన గుర్తింపు ఉంద‌న్నారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. ఏపీటీఏ అధికారులు, టీమ్‌వ‌ర్క్ సంస్థ ప్ర‌తినిధుల‌తో క‌లిసి ఉత్స‌వాల పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించారు.

(డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్‌, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)

Search
Categories
Read More
Telangana
ఖమ్మం ఎంసీహెచ్ తగ్గుతున్న ప్రసవాలు...
ఒకప్పుడు నెలకు వెయ్యికి పైగా డెలవరీలతో రికార్డు సృష్టించిన ఖమ్మం MCH ప్రస్తుతం వెలవెలబోతోంది....
By Krishna Balina 2026-03-04 10:34:45 0 457
Telangana
మల్కాజిగిరిలో కాంగ్రెస్ శక్తి ప్రదర్శన… కార్యకర్తల సమావేశంతో నూతన ఉత్సాహం!”|
మేడ్చల్ మల్కాజిగిరి : మల్కాజిగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శక్తిని మరింత బలోపేతం చేసే దిశగా...
By Sidhu Maroju 2026-03-22 09:04:00 0 241
Telangana
రిచ్ మాక్స్ గోల్డెన్ బ్రాంచ్ ప్రారంభం.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  అల్వాల్లో ప్రారంభమైన ప్రముఖ గోల్డ్ లోన్ కంపెనీ రిచ్ మాక్స్...
By Sidhu Maroju 2025-08-30 14:26:19 0 428
Telangana
రాజాపేట ఎస్ఐకి పోలీస్ సేవా పతకం
బోనగిరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాజపేట ఎస్సై మహమ్మద్...
By Pindikura Mahesh 2026-08-15 16:32:45 0 134
Bharat Aawaz
Article 11 – Citizenship Laws Are in the Hands of Parliament
What Is Article 11 All About? While the Constitution (Part II) talks about who is a...
By Citizen Rights Council 2025-06-26 12:56:38 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com