చిత్తూరు జిల్లా వీకోట : దారుణం: ఏబీఎన్ జర్నలిస్ట్ దారుణ హత్య

0
123

ఉదయం మార్నింగ్ వాక్‌లో ఉండగా కత్తులతో దాడి

హత్య కేసులో రౌడీ షీటర్ తమీమ్‌ను అనుమానిస్తున్న పోలీసులు

ఘటనను తీవ్రంగా ఖండించి, నిరసనలకు పిలుపునిచ్చిన జర్నలిస్ట్ సంఘాలు

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. వి. కోట పట్టణంలో ఈరోజు ఉదయం ఈ సంఘటన జరిగింది.

 

వివరాల ప్రకారం, జగన్మోహన్ రెడ్డి రోజూలాగే ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళ్లారు. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆయనపై కత్తులతో దాడి చేసి, అక్కడికక్కడే హత్య చేసి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

 

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ హత్య కేసులో వి. కోటకు చెందిన రౌడీ షీటర్ తమీమ్‌ను పోలీసులు ప్రధాన నిందితుడిగా గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో నివసిస్తున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

ఈ హత్యను ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరమ్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండించాయి. నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చాయి. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బాల్య వివాహాలు - చట్ట విరుద్ధం :విశాఖ అధికారులు వెల్లడి
బాల్య వివాహాలు అంటే 18 లేదా 21సంవత్స రములు రాక మునుపు చేస్తే వివాహాలను బాల్య వివాహాలు అంటారు. ఐతే...
By Mobbu Venkatramana 2026-02-25 14:08:18 0 292
Andhra Pradesh
గుంటూరు పశ్చిమ అభివృద్ధిపై కూటమి నేతల మధ్య పూర్తి సమన్వయం – ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు పశ్చిమ అభివృద్ధి పై ఎన్డీయే కూటమి నేతల మధ్య పూర్తి సమన్వయం ఉందని, మేయర్ కోవెలమూడి రవీంద్ర...
By John Baji 2025-12-30 01:14:44 0 224
Telangana
Telangana state smart ration cards distribution
రాష్ట్రవ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభిస్తున్న సందర్భంగా సంగారెడ్డిలోని...
By G k Nookala 2026-08-15 10:55:02 0 149
SURAKSHA
S. Asker Ali IAS: Building Better Infrastructure for Progress
From a determined UPSC aspirant to Secretary, Public Works Department, S. Asker Ali, IAS, has...
By Lokeshwari Panthadi 2026-07-27 11:25:27 0 197
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com