సి ఎస్ ఎస్ నిధులు నూరు శాతం వినియోగించాలి గుంటూరు జిల్లా కలెక్టర్. ఏ తమిమ్ అన్సారియా

0
214

 *సీఎస్ఎస్ నిధులు నూరుశాతం వినియోగించాలి* గుంటూరు, డిసెంబర్ 23:-జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాలకు (సీఎస్ఎస్) మంజూరు చేసిన నిధులు నూరుశాతం నిర్దేశించిన కాలపరిమితి లో వినియోగించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా మంజూరు చేసిన నిధులు వినియోగం పై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధి, త్రాగునీరు,శానిటేషన్, విద్య, ఆరోగ్యం,పోషణ, మహిళ–బాలల అభివృద్ధి తదితర కార్యక్రమాలకు కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా మంజూరు చేసిన నిధులు, వాటి ద్వారా నిర్వహిస్తున్న పనులపై అధికారులకు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. శాఖల వారీగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన విధులు, వాటిలో వినియోగించిన నిధులు, మిగిలిన నిధుల వినియోగానికి కార్యాచరణ ప్రణాళికను సోమవారం నాటికి పూర్తిస్థాయి నివేదిక విభాగాధిపతులు అందించాలని సూచించారు. సమావేశంలో సమగ్ర శిక్ష ఏపిసీ పద్మావతి, డీఈఓ సలీం భాష, ఐసీడీఎస్ పీడీ ప్రసూన, ఉద్యాన శాఖ అధికారి రవీంద్ర, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
మెట్లపై నుండి జారి పడి భర్త మృతి.. మనస్తాపంతో పెట్రోల్ పోసుకొని భార్య బలవన్మరణం
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మమత(30)ను 14 నెలల కిందట ప్రేమ వివాహం...
By Pinnehasan Odela 2026-02-24 11:42:49 0 235
Andhra Pradesh
ప్రజా సమస్యల పరిష్కార వేదిక
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని...
By Bharat Aawaz 2025-05-27 04:42:17 0 3K
Telangana
మదర్స్ డే రోజున వరంగల్ జిల్లాలోని మలుగు రోడ్ జంక్షన్ వద్ద విగ్రహావిష్కరణ
WGL: కొండంత కష్టాన్ని మోసేది.. కొండంత ప్రేమను పంచేది..! భారత్ అవాజ్ న్యూస్: మే 10 రోజున ...
By Gujile Ramu 2026-05-10 09:48:10 0 107
Telangana
ప్రజల కోసం రాజీపడను: ఈటల.|
"కాళేశ్వరం అవినీతిపై చర్యలు తీసుకోండి... నీటి సరఫరాపై రాజకీయాలు వద్దని వ్యాఖ్య" మేడ్చల్...
By Sidhu Maroju 2026-07-10 10:11:43 0 124
Business & Finance
ITR Filing Made Easy for Stress-Free Tax Compliance
ITR (Income Tax Return) Filing is essential for individuals, professionals, and businesses to...
By Navya Sree 2026-07-21 06:27:01 0 42
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com