ప్రజల కోసం రాజీపడను: ఈటల.|

0
213

"కాళేశ్వరం అవినీతిపై చర్యలు తీసుకోండి... నీటి సరఫరాపై రాజకీయాలు వద్దని వ్యాఖ్య"

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, జూలై 10: తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ పడబోనని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. మేడిగడ్డలో నీటిని నిల్వ చేయకుండానే కిందకు వెళ్తున్న నీటిని ఎత్తిపోవచ్చని, ఈ విషయంలో రాజకీయాలు చేయకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన ఆయన, తాను తెలంగాణ మట్టిబిడ్డనని, ఉద్యమకారుడినని పేర్కొంటూ ప్రజలకు నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోనని అన్నారు. "మేడిగడ్డలో నీళ్లు నింపమని అడగడం లేదు... నదిలోకి వెళ్తున్న నీటిని పంప్ చేయమని మాత్రమే కోరుతున్నాం" అని తెలిపారు.

హైదరాబాద్‌కు ఇప్పటికే 107 MGD నీటి కొరత ఉందని, రైతులు, ఉత్తర తెలంగాణ, ఖమ్మం, నల్లగొండ ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంజినీర్లతో చర్చించి సమస్యను పరిష్కరించాలని, రాజకీయ విమర్శల కంటే ప్రజల ప్రయోజనాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగి ఉంటే బాధ్యులను గుర్తించి అరెస్టు చేయాలని, అవినీతి సొమ్మును రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రాజెక్టును రాజకీయ కారణాలతో నిరుపయోగంగా మార్చొద్దని అన్నారు.

తాను ఎవరి స్క్రిప్ట్‌తో మాట్లాడే వ్యక్తిని కాదని, ప్రజల కోసం అవసరమైతే ఎంతవరకైనా పోరాడతానని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు-2026
రెవెన్యూ ఉద్యోగులు క్రీడల పోటీల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎపిఆర్ఎస్ఏ అధ్యక్షులు కె. శ్రీరాములు...
By Manda Ramkumar 2026-03-26 10:14:06 0 224
Andhra Pradesh
ఇది చూడండి
16 ఏళ్లలోపు వారిని సోషల్ మీడియా యాప్‌ల నుండి నిషేధించే ఆస్ట్రేలియా చారిత్రాత్మక చట్టాన్ని,...
By Thokala Sivaji 2026-03-28 06:10:03 0 749
Andhra Pradesh
పదో తరగతి పరీక్షల్లో గొప్ప విజయం సాధించాలి-డాక్టర్ గ్లోరి యానెట్ సౌపాటి
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులు ఎటువంటి ఆందోళన,ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతమైన...
By Vadlamudi NagaVenkat 2026-03-15 14:19:37 0 615
Andhra Pradesh
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు వై. ధరణి రెడ్డి జన్మదిన సందర్భంగా.
ఎమ్మిగనూరులో మంత్రాలయం వై. బాలనాగిరెడ్డి కుమారుడు వై.ధరణి రెడ్డి జన్మదిన సందర్భంగా బ్లడ్ క్యాంపు...
By Boya Dasthagiri 2026-04-02 10:17:01 0 221
Andhra Pradesh
త్రిపురాంతకం  మండల కేంద్రం, అదేవిధంగా రాజుపాలెం స్వర్ణ గ్రామకార్యాలయాల్లో సర్ ప్రోగ్రాం
త్రిపురాంతకం  మండల కేంద్రం,  అదేవిధంగా రాజుపాలెం స్వర్ణ గ్రామకార్యాలయాల్లో సర్...
By Chennaiah Kati 2026-07-12 17:53:33 0 109
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com