లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలన దేవాదాయ శాఖ కమిషనర్

0
340

*సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలి*

 

*-దేవాదాయ శాఖ కమిషనర్ రామ్ చంద్ర మోహన్*

 

*-నృసింహుని దేవస్థానంలో జరుగుతున్న ముక్కోటి ఏర్పాట్ల పరిశీలన*

 

 

*మంగళగిరి:*

శతాబ్దాల చరిత్ర కలిగిన మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈనెల 30వ తేదీన జరిగే వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనానికి తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్ రామ్ చంద్ర మోహన్ సూచించారు. సోమవారం ఆయన మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న ముక్కోటి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శతాబ్దాల చరిత్ర కలిగిన మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఒక ప్రత్యేక ప్రాశస్త్యం ఉందన్నారు. ఇదొక దివ్య క్షేత్రం అని వైష్ణవ క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని ఉత్తర ద్వారం లో దర్శించుకుని శంఖు తీర్థం స్వీకరించి తరించాలని భక్తులు కోరుకుంటారన్నారు. మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ముక్కోటి ఉత్సవానికి 30 వేల మంది భక్తులు వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా దేవస్థానం తరఫున ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో చేపట్టిన ఏర్పాట్లు దాదాపు పూర్తి కావొచ్చాయన్నారు. ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులందరూ... ప్రధానంగా సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకుని శంఖు తీర్థం స్వీకరించి వెళ్లేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు. భక్తులకు కన్నుల పండువగా ఉండేవిధంగా స్వామివారి అలంకరణ పై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించడంతోపాటు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ తాగునీరు, ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ముక్కోటి ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా డిప్యూటీ కమిషనర్ కేబి శ్రీనివాస్, పెదకాకాని దేవస్థాన ఈఓ లీలా కుమార్ లను నియమించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సహాయ కమిషనర్ కోగంటి సునీల్ కుమార్ పాల్గొన్నారు.

 

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్. డ్రైనేజీ లు క్లియర్
నిజామాబాద్‌ జిల్లా నెహెరునగర్‌లో శుక్రవారం గ్రామ సర్పంచ్‌ ఇమ్రాన్‌ అధ్వర్యంలో...
By Sadaq Sadaq 2026-03-06 17:29:50 0 207
Andhra Pradesh
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి నేటి షెడ్యూల్
*ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్(16.12.2025)* • ఉదయం 10.15 గంటలకు...
By Rajini Kumari 2025-12-16 08:38:10 0 213
Telangana
"ఆదివారం నుంచి కనిపించని బాలుడు.. సమాచారం ఇవ్వాలంటూ పోలీసుల విజ్ఞప్తి.|
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా : బొల్లారం బజార్ ప్రాంతంలో ఏడు సంవత్సరాల బాలుడు అదృశ్యమైన ఘటన...
By Sidhu Maroju 2026-06-03 09:08:58 0 243
Telangana
Congress leader kicks Indiramma house beneficiary in Sircilla
Congress leader kicks Indiramma house beneficiary in Sircilla Rajanna-Sircilla: A...
By BMA ADMIN 2025-05-19 17:20:47 0 3K
Andhra Pradesh
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి.. పర్యావరణ పరిరక్షణకు పిలుపు.
 అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన సబ్ కలెక్టర్ చల్లా...
By Pagadala Venkateswar 2026-09-13 07:15:24 0 73
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com