నేటి రాశి ఫలాలు 22 డిసెంబర్ 2025 | రోజువారీ రాశి పల్లు | మేషం నుంచి మీనం వరకు పూర్తి ప్రెడిక్షన్స్ | భారత్ ఆవాజ్

0
482

*22-12-2025 సోమవారం*

    *🌷రాశి ఫలితాలు🌷*

---------------------------------------

మేషం

 

భూ క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశజనకంగా ఉంటాయి. సోదరులతో వివాదాలు రాజి చేసుకుంటారు. ఉద్యోగులకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

---------------------------------------

వృషభం

 

రావలసిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. పాత బాకీలు కొంత వరకు తీరుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.

---------------------------------------

మిధునం

 

నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. సంతాన విద్యా విషయంలో మిశ్రమ ఫలితాలుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి పని ఒత్తిడి పెరిగి తగిన విశ్రాంతి లభించదు. వ్యాపారాలు మందగిస్తాయి. ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి.

---------------------------------------

కర్కాటకం

 

దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులులో శ్రమాధిక్యత పెరుగుతుంది. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి. వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. నిరుద్యోగులకు ప్రయత్న లోపం వలన లభించిన అవకాశాలు చేజారుతాయి. ఆర్థిక వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.

---------------------------------------

సింహం

 

చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. మిత్రులతో చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాల విస్తరణకు అవరోధాలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో సమస్యల నుండి బయటపడతారు. సంతాన శుభకార్య విషయాలపై చర్చలు ఫలిస్తాయి. అవసరానికి చేతికిడబ్బు అందుతుంది.

---------------------------------------

కన్య

 

బంధు వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చూడతారు. కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------

తుల

 

ఋణదాతల ఒత్తిడి నుండి అధికమై నూతన ఋణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి. వ్యాపారాలలో ఊహించని నష్టాలు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమ ఫలించదు. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు.

---------------------------------------

వృశ్చికం

 

ఆస్తి వ్యవహారాలలో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిదానిస్తాయి. మాతృ వర్గ బంధువుల నుండి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు నష్టాలు కలిగిస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. 

---------------------------------------

ధనస్సు

 

వివాదాలకు సంభందించి మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో ఓర్పుతో మీ సమస్యల నుండి బయటపడతారు. వ్యాపారమునకు నూతన పెట్టుబడులు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ పొందుతారు.

---------------------------------------

మకరం

 

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. వ్యాపారాలు మరింత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి.

---------------------------------------

కుంభం

 

ఉద్యోగమున అనుకూల మార్పులు ఉంటాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. వృత్తి వ్యాపారమున ఆశించిన లాభాలు పొందుతారు. బంధు మిత్రులతో గృహమున సందడిగా గడుపుతారు.

---------------------------------------

మీనం

 

కొన్ని వ్యాపావహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సన్నిహితుల నుండి ఊహించని సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. దైవ సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

---------------------------------------

🍁 శుభం భూయాత్ 🍀

Search
Categories
Read More
Andhra Pradesh
ఈ రోజు జనసేనపార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల ఆశయాలకి ఆకర్షితులై
ఈరోజు జనసేనపార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి...
By Chennaiah Kati 2026-01-25 07:24:14 0 243
Andhra Pradesh
మదనపల్లిలో ఘనంగా జాతీయ కుష్ఠ వ్యాధి వ్యతిరేక దినోత్సవం.
మదనపల్లె జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య అధ్యక్షతన మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా...
By Pagadala Venkateswar 2026-01-31 05:49:18 0 189
Andhra Pradesh
సచివాలయం వద్ద దీపాల కాంతులు
చీరాల మండలం బుర్లవారిపాలెం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శివ లీల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్...
By Vadlamudi NagaVenkat 2026-04-03 06:09:58 0 407
Andhra Pradesh
కార్మికులపై పోలీసులు లాఠీచార్జి చేయడం దుర్మార్గం పల్లె కృష్ణ CTIU తాడేపల్లి మండలం కన్వీనర్
కార్మికులపై పోలీసులు లాఠీచార్జి చేయడం దుర్మార్గం.    పల్లె కృష్ణ, సిఐటియు తాడేపల్లి...
By Rajini Kumari 2025-12-20 13:49:07 0 248
Andhra Pradesh
పేద ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ
బొబ్బిలి షాదీఖానాలో హుదా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం పేద ముస్లింలకు ఎమ్మెల్యే...
By Boiena Rajesh 2026-03-14 12:08:41 0 248
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com