పోలియో రైటర్ రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం జవ్వాది

0
224

*పోలియో రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం : జవ్వాది*

 

*చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం*

 

*పెదవడ్లపూడి పిహెచ్సీలో పోలియో చుక్కలు కార్యక్రమం ప్రారంభం*

 

రాష్ట్రాన్ని పూర్తిగా పోలియో రహితంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ తెలిపారు. ఆదివారం మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిహెచ్సి) నందు నిర్వహించిన పోలియో చుక్కలు కార్యక్రమాన్ని మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా జవ్వాది మాట్లాడుతూ, పోలియో వంటి ప్రాణాంతక వ్యాధి నుంచి చిన్నారులను రక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి తల్లిదండ్రులు బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించి, రాష్ట్రాన్ని పూర్తిగా పోలియో రహితంగా మార్చేందుకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, చిన్న వయసులోనే నివారణ చర్యలు చేపట్టడం ద్వారా భవిష్యత్ తరాలను సురక్షితంగా తీర్చిదిద్దవచ్చని అన్నారు.పోలియో నివారణ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది కృషి అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేస్తేనే ఇటువంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాదల రమేష్ బాబు, బొర్రా శ్రీకాంత్... వైద్యాధికారులు, నర్సులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Mizoram
Rural Healthcare Infrastructure Expansion Strengthens Mizoram
Mizoram continues to strengthen its rural healthcare infrastructure through the expansion of...
By Fathima Safa 2026-06-25 05:22:46 0 129
Telangana
భారీ వర్షాలతో అప్రమత్తమైన హైడ్రా
  నగరంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ట్యాంక్‌బండ్, సచివాలయం పరిసరాల్లో నిలిచిన వరద...
By Thalakayala Nagashiva 2026-06-09 14:40:18 0 238
Telangana
ఎల్లమ్మ&కొమురవేల్లి మల్లన్న కల్యాణంవేదికలో సర్పంచ్ వార్డు సబ్యులు
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చౌదరపల్లి గ్రామంలో రేణుకా ఎల్లమ్మ &కొమురవేల్లి...
By MERIGE MALLESH 2026-04-01 10:41:05 0 2K
PRAGATI
🌍 You Don’t Need To Be Big To Make A Big Impact
🌍 You Don’t Need To Be Big To Make A Big Impact Your Local Voice Can Create National...
By PRAGATI 2025-04-30 11:44:14 0 6K
Telangana
"రైల్వే స్టేషన్‌లో.. గంజాయి గుట్టురట్టు”
సికింద్రాబాద్ : దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగిస్తున్న నేపథ్యంలో...
By Sidhu Maroju 2026-05-08 11:38:31 0 379
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com