నాడు నేడు ఎప్పుడూ మంగళగిరి ప్రజల సేవలో మంత్రి నారా లోకేష్

0
220

*నాడు, నేడు, ఎప్పుడూ మంగళగిరి ప్రజల సేవలో ఉంటాను*

 

*అందరం కలిసికట్టుగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం*

 

*పరీక్ష పెట్టే దేవుడు.. వాటిని జయించే శక్తి కూడా ఇస్తాడు*

 

*మంగళగిరిలో కృపాసమాజం వారి కృపాప్రాంగణం పున:ప్రతిష్ట ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్*

 

*కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి*

 

మంగళగిరి: నాడు, నేడు, ఎప్పుడూ మంగళగిరి ప్రజల సేవలో ఉంటానని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలోని తెనాలి రోడ్డులో కృపాసమాజం వారి కృపాప్రాంగణం పున:ప్రతిష్ట ఆరాధన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కృపాప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. కృపా సమాజం ఆధ్వర్యంలో కృపా ప్రాంగణం పునర్ నిర్మాణం చేసుకుని ప్రారంభించుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. దేవుడు ఒక్కోసారి మనకు పరీక్షలు పెడతాడు. వాటిని జయించే శక్తి కూడా ఆ దేవుడే ఇస్తాడు. అలాంటి పరీక్ష మన కృపా సమాజానికి దేవుడు పెట్టాడు. ఆ సమస్యను పరిష్కరించే శక్తి మన పాస్టర్ బేతు వివేక్ గారికి ఆ దేవుడు ఇచ్చాడు. ఆయన సంకల్పంతో సమస్యను పరిష్కరించారు. 7 నెలల్లోనే కృపా ప్రాంగణాన్ని కలిసికట్టుగా పునర్ నిర్మించుకున్నాం. దేవుడి ఆశీస్సులు వల్లే ఇది సాధ్యమైంది. 

 

*మతాలు వేరైనా అందరం కలిసికట్టుగా ఉందాం*

 

మతాలు వేరైనా అందరం కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది. క్రిస్మస్ మాసం సందర్భంగా మన ఇంటి పక్కన, వీధిలో, గ్రామంలో ఉన్నవారికి సాయపడదాం. ఒక్కరితో అన్ని సమస్యలు పరిష్కారం కావు. సమాజం కలిసివస్తే కలిసికట్టుగా సమస్యలు పరిష్కరించుకోవచ్చు. 2019లో దేవుడు నాకో పరీక్ష పెట్టాడు. దానిని జయించే శక్తి కూడా ఇచ్చాడు. మంగళగిరిలో కమ్యూనిటీ భవనాలను నిర్మించడంతో పాటు స్మశానాలను అభివృద్ధి చేస్తున్నాం. నాడు, నేడు, ఎప్పుడూ మంగళగిరి ప్రజల సేవలో ఉంటానని మంత్రి చెప్పారు. అనంతరం క్రిస్మస్ ను పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పాస్టర్లకు నారా లోకేష్ చేతుల మీదుగా నూతన వస్త్రాలను బహూకరించారు. 

 

ఈ కార్యక్రమంలో పాస్టర్ బేతు వివేక్, బేతు ప్రశాంత్, కె.విజయ్, పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌ నందం అబద్దయ్య, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

*****

Search
Categories
Read More
Andhra Pradesh
మినీ గోకులం (పశువుల షెడ్డు) శాంక్షన్ ఆర్డర్ కాపీలను లబ్దిదారులకు అందచేసిన పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్.
పొన్నూరు పట్టణంలోని మండల ప్రజా పరిషత్ (MPDO) కార్యాలయం నందు పొన్నూరు మండలంలోని వివిధ గ్రామాలకు...
By John Baji 2026-02-03 07:27:51 0 392
Andhra Pradesh
ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఎక్స్ గ్రేషియా
ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఎక్స్ గ్రేషియా, బీమా కలిపి మొత్తం...
By Chennaiah Kati 2026-07-14 03:29:36 1 202
Andhra Pradesh
నిమ్మనపల్లెలో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి.
నిమ్మనపల్లి మండలంలో బుధవారం చేపల వేటకు వెళ్లిన వెంకటరమణ (45) అనే వ్యక్తి ప్రమాదవశాత్తూ చెరువులో...
By Pagadala Venkateswar 2026-05-20 13:50:44 0 129
Andhra Pradesh
పుంగునూరు: మేలుపట్లలో ఘనంగా పశువుల పండుగ, రైతుల ప్రత్యేక పూజలు.
Tv txపుంగనూరు సమీపంలోని మేలుపట్ల గ్రామంలో బుధవారం రైతులు పశువుల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ...
By Kothuru Murali 2026-01-29 08:31:20 0 206
Telangana
మొహరం పండుగ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే
మొహరం పండుగ ఏర్పాట్లపై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఆరవ అంతస్తు సమావేశ హాల్లో రవాణా...
By Sidhu Maroju 2025-06-10 15:30:37 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com