నర్స్ వృత్తి అమ్మ చేసే సేవ లాంటిదే- ఎమ్మెల్యే శ్రీ గణేష్.|

0
260

 

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఈశ్వరీ బాయి మెమోరియల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాల ఫేర్ వెల్ & ఫ్రెషర్స్ డే వేడుకలు శుక్రవారం మారేడ్ పల్లి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో కళాశాల యాజమాన్యం వారు నిర్వహించారు . ఈ వేడుకలకు యాజమాన్యం ఆహ్వానం మేరకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

వేదికపై విద్యార్ధినీ, విద్యార్ధులకు మెరిట్ స్కాలర్ షిప్ లు, అకడమిక్ సర్టిఫికెట్ లను ఎమ్మెల్యే అందజేశారు.

 అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజానికి సేవ చేసే అదృష్టం నర్సు ల రూపంలో మీకు వచ్చిందని, హాస్పటల్స్ లో మీది తల్లి పాత్ర వంటిదని, మీ సేవల ద్వారా ప్రజలకు ఆత్మీయులుగా మారి, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు, కళాశాల యాజమాన్యానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పారు.

పేద, మధ్యతరగతి విద్యార్ధినీ , విద్యార్ధులకు అందుబాటులో మంచి విద్యని అందిస్తూ ఇంత మంచి కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ రామచంద్రా రెడ్డి, డాక్టర్ కృష్ణా రెడ్డి, శ్రీమతి మేఘనా రెడ్డి గార్లకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ షైనీ జాన్, స్కూల్ హెడ్ విజిత వాణి, కాంగ్రెస్ నాయకులు బద్రీనాథ్ యాదవ్, అరవింద్ యాదవ్ లు పాల్గొన్నారు.

Sidhumaroju    Farewell Pressures Day celebrations

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: నల్ల బెల్లం స్వాధీనంపై అప్డేట్
కడప ఎన్ఫోర్స్మెంట్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, పుంగనూరు...
By Kothuru Murali 2026-04-25 03:44:10 0 128
Andhra Pradesh
అయేషా మీరా తల్లిదండ్రుల వినతి పత్రం
తమ కుమార్తె ఆయేషా మీరా పేరుతో విద్యా సంస్థను నెలకొల్పి డిసెంబర్ 27వ తేదీన సంస్మరణ దినోత్సవం...
By Rajini Kumari 2025-12-27 11:06:49 0 251
Andhra Pradesh
ప్రధాని ముఖ్యమంత్రి సూచనలతో ఇంధన పొదుపు కార్యక్రమాన్ని చేపట్టిన మిల్క్ యూనియన్ చైర్మన్ ఆంజనేయులు
కృష్ణా   *ప్రధాని, ముఖ్యమంత్రి సూచనలతో ఇంధన పొదుపు చర్యలు చేపట్టిన కృష్ణా మిల్క్ యూనియన్...
By Rajini Kumari 2026-05-16 14:56:14 0 157
Telangana
సీసీ రోడ్డు ప్రారంభించిన. నర్సంపేట..ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు...
భారత్ ఆవాజ్  న్యూస్ : 27 ఏప్రిల్ నెక్కొండ   పట్టణలోని బీసీ కాలనీ వాస్తవ్యుల చిరకాల...
By Gujile Ramu 2026-04-27 23:47:02 0 172
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com