బాలింత మృతికి ఆ ఇద్దరు వైద్యులే కారణం, కేసు నమోదుకు డిమాండ్

0
309
బాలింత మృతికి ఆ ఇద్దరు వైద్యులే కారణం, కేసు నమోదుకు డిమాండ్
 
చీరాల: చీరాలలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ రామకృష్ణ హనుమాన్, డాక్టర్ గోరంట్ల రాజేష్ ల నిర్లక్ష్యం కారణంగా సౌమ్య అనే బాలింత మృతి చెందిందని హైకోర్టు అడ్వకేట్ రజిని శనివారం మీడియాకు చెప్పారు. డిసెంబర్ 16వ తేదీ ఉదయం ఆరు గంటలకు సౌమ్యకు డాక్టర్ రామకృష్ణ హనుమాన్ కు చెందిన శంకర్ లాప్రోస్కోపీ అండ్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్లో సిజేరియన్ ఆపరేషన్ జరిగిందని, కానీ ఆమెకు సాయంత్రం వరకు స్పృహ రాకపోయినా డాక్టర్ పట్టించుకోలేదన్నారు.తదుపరి గోరంట్ల రాజేష్ ఆస్పత్రికి తీసుకువెళ్లి అక్కడకు మూడు గంటలు వృధా చేశారన్నారు.చివరకు పరిస్థితి విషమించడంతో గుంటూరు తరలిస్తుండగా ఆ రాత్రి సౌమ్య మార్గమధ్యంలో మృతి చెందిందన్నారు. డాక్టర్లు కనుక ఆలస్యం చేయకుండా ఆమెను వెంటనే గుంటూరు తరలించి ఉండుంటే ఆమె బతికేదన్నారు.కేవలం ఆ ఇద్దరు వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె మరణించినందున వారిపై తక్షణం క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రజని డిమాండ్ చేశారు.లేకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.మీడియా సమావేశంలో సౌమ్య తండ్రి పి ఏడుకొండలు సిఐటియు నాయకుడు వసంతరావు తదితరులు పాల్గొన్నారు.
 
#Narendra
Search
Categories
Read More
Chhattisgarh
Chhattisgarh's Krishak Unnati Yojana Boosts Rural Economy
Agriculture continues to anchor Chhattisgarh’s economic strategy, underscored by the robust...
By Lokeshwari Panthadi 2026-06-26 12:14:08 0 133
Andhra Pradesh
విభి జి రామ్ జి చట్టం 2025 గురించిన కొత్త మార్గదర్శకాలు గురించి చీరాల మరియు వేటపాలెం మండల స్థాయి సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేయడమైనది.
చీరాల: ఈరోజు వేటపాలెం మండలం కొత్తపేట గ్రామపంచాయతీ నందు విభి జి రామ్ జి చట్టం 2025 గురించిన కొత్త...
By Gadiyapudi Narendra 2026-03-02 17:26:46 0 265
Andhra Pradesh
మదనపల్లి లో యువకుడు ఆత్మహత్యాయత్నం
మదనపల్లి పట్టణంలో కుటుంబ సమస్యలతో మనస్థాపానికి గురైన విగ్నేష్ (25) అనే యువకుడు ఎలుకల మందు తాగి...
By Pagadala Venkateswar 2026-01-15 11:21:14 0 219
Andhra Pradesh
AP TET-2025: ఏపీ టెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్షా ఫలితాలను శుక్రవారం నాడు మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. తన...
By Pagadala Venkateswar 2026-01-09 14:49:33 0 260
BMA
Information Defense: Press Countering Foreign Psy-Ops
A strong, independent domestic press plays a crucial role in defending national security by...
By JoinBMA 2026-08-21 10:54:04 0 95
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com