Gold, Silver Prices: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన, బంగారం, వెండి ధరలు!!!!!

0
256

Gold, Silver Prices: దేశీయ డిమాండ్ నుండి ప్రపంచ ఉద్రిక్తతలు, ఇతర అంశాల వరకు అనేక ప్రధాన కారణాలు వెలుగులోకి వచ్చాయి. వెండి ధరల పెరుగుదలకు పారిశ్రామిక డిమాండ్ ప్రధాన కారణమని నమ్ముతారు. సౌర ఫలకాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, గ్రీన్..

 

Gold, Silver Prices: ప్రతి రోజు బంగారం ధరల్లో మార్పుచేర్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు అంతకు రెట్టింపు ధర పెరుగుతోంది. మన భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రస్తుతం సామాన్యుడు గ్రాము బంగారం కొనాలంటేనే భయపడే రోజులు వచ్చాయి. ఇప్పుడు పది గ్రాముల బంగారం కొనాలంటేనే లక్షా 35 వేల వరకు చెల్లించుకోవాల్సిందే.

 

అయితే ప్రతి రోజు ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు అప్‌డేట్‌ అవుతుంటాయి. ఈ సమయంలో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. ప్రస్తుతం శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 660 రూపాయల వరకు తగ్గింది. దీంతో ఇప్పుడు తులం ధర రూ.1,34,180 వద్ద ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,23,000 వద్ద కొనసాగుతోంది.

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. అందుకే చాలా మంది బంగారం, వెండి కొనుగోలులో బిజీగా ఉన్నారు. చాలా మంది వ్యక్తిగత ఉపయోగం కోసం, వారి భవిష్యత్తు కోసం కూడా బంగారం, వెండిని కొనుగోలు చేస్తారు. మీరు కూడా ఇలాంటిదే ఆలోచిస్తుంటే, కొనుగోలు చేసే ముందు బంగారం, వెండి ధరలను ఖచ్చితంగా తనిఖీ చేయాలి.

ఇక వెండి ధరల్లో ఈ గణనీయమైన పెరుగుదల కొనసాగుతోంది. వెండి కూడా ఏ మాత్రం తగ్గకుండా పరుగులు పెడుతోంది. అయితే ప్రస్తుతం మాత్రం కిలో వెండిపై ఏకంగా రూ.2000 వరకు దిగి వచ్చింది. ప్రస్తుతం కిలో వెండి ధర దేశీయంగా రూ.2,09,000 వద్ద ఉంది.

 

ఇక హైదరాబాద్‌, చెన్నై, కేరళ ప్రాంతాల్లో అయితే ధర భారీగా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.2,21,000 వద్ద కొనసాగుతోంది. దేశీయ డిమాండ్ నుండి ప్రపంచ ఉద్రిక్తతలు, ఇతర అంశాల వరకు అనేక ప్రధాన కారణాలు వెలుగులోకి వచ్చాయి. వెండి ధరల పెరుగుదలకు పారిశ్రామిక డిమాండ్ ప్రధాన కారణమని నమ్ముతారు. సౌర ఫలకాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలలో వెండికి బలమైన డిమాండ్ దాని నిరంతర పెరుగుదలకు దారితీసింది.

 

#Sivanagendra #Trending #Bharathaawaz #Newscoordinator 

Search
Categories
Read More
BMA
Gamifying Accountability: The 2026 Manifesto Tracker
Moving beyond static charts, digital newsrooms in 2026 are launching interactive "Manifesto...
By JoinBMA 2026-08-22 04:01:37 0 384
Andhra Pradesh
Kadapa RTC bus fire: కడప జిల్లాలో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు... తప్పిన పెను ప్రమాదం.
Kadapa RTC bus fire: కడప జిల్లాలో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు... తప్పిన పెను ప్రమాదం 05-04-2026...
By Pagadala Venkateswar 2026-04-06 04:35:42 0 465
Telangana
Telangana engineers day
తెలంగాణలో అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేసి, చారిత్రక భవనాల నిర్మాణానికి మార్గదర్శకత్వం...
By G k Nookala 2026-07-11 06:31:33 0 128
Andhra Pradesh
నాగార్జునసాగర్ ప్రాజెక్టు వరద నీటి విడుదల – పూర్తి స్థాయికి చేరిన నీటిమట్టం
ఆంధ్ర ప్రదేశ్‌ - నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద వరద ప్రభావం పెరుగుతోంది. ప్రాజెక్టు...
By Bharat Aawaz 2025-08-11 12:47:30 0 1K
Andhra Pradesh
ప్రభుత్వ సేవలన్నీ ఒకే యాప్‌లో.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.
  ప్రభుత్వ సేవలన్నీ ఒకే యాప్‌లో.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు 10-06-2026 Wed 07:14...
By Pagadala Venkateswar 2026-06-10 05:50:36 0 99
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com