నూతన పవర్ బోర్ వెల్ ప్రారంభించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే.|

0
242

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కంటోన్మెంట్  3 వార్డు మడ్ ఫోర్డ్ తిరు తుల్కంతమ్మన్ దేవాలయానికి వచ్చే భక్తులు మరియు సమీప బస్తీ వాసులు ఎన్నో ఏళ్లుగా మంచినీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొంటున్నారు . ఇటీవల బస్తీ వాసులు వారి ఇబ్బందిని ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకురావడంతో స్టేట్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ నుంచి నిధులు కేటాయించి నూతన పవర్ బోర్ వెల్ ను వేయించారు . శుక్రవారం బస్తీ వాసుల ఆనందోత్సాహాల మధ్య ఎమ్మెల్యే శ్రీగణేష్ నూతన పవర్ బోర్ వెల్ ను ప్రారంభించారు.ఎన్నో ఏళ్ల ఇబ్బందిని తీర్చిన ఎమ్మెల్యే శ్రీగణేష్ కు బస్తీ వాసులు కృతజ్ఞతలు తెలపడంతో ఎమ్మెల్యే మీ సమస్యలను తీర్చడమే నా బాధ్యత అని, నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే నా ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేష్, ఉత్తరయ్య, జమీల్, వినోద్ , శ్రీనివాస్ గౌడ్, మురళీ,ఈపూరి వినోద్,షణ్ముఘం , మధు,, నాగరాజు , రవి , పరమేష్, లయన్ వెంకట్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: బాలికల కళాశాల ప్రిన్సిపల్‌గా శివపార్వతి దేవి.
మదనపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా సీనియర్ అధ్యాపకురాలు శివపార్వతి దేవి...
By Pagadala Venkateswar 2026-03-03 03:02:21 0 194
Andhra Pradesh
బస్సు ఆపకుండా వెళ్ళిపోయినందుకు బస్సు డ్రైవర్ ని చెప్పుతో కొట్టిన మహిళ
*ఆర్టీసీ డ్రైవర్ పై చెప్పుతో కొట్టిన మహిళ.*     బస్సు ఆపలేదనే కారణంతో ఆర్టీసీ...
By Rajini Kumari 2026-04-24 12:18:38 0 190
Andhra Pradesh
వైయస్ షర్మిల రెడ్డి APCC చీఫ్ కాంగ్రెస్ పార్టీ 141 వ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు
scroll    విజయవాడ    *వైఎస్ షర్మిలా రెడ్డి* APCC చీఫ్    -...
By Rajini Kumari 2025-12-28 09:46:26 0 220
Andhra Pradesh
Chowdepalli: చౌడేపల్లి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయానికి రిటైర్డ్ పోలీస్ కడియాల ప్రభాకర్ పంచలోహ పాద పద్మలు, గరుడ పీఠం బహుకరణ. స్వామివారికి విశేష పూజలు.
Chowdepalli: స్థానిక రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయానికి దాత కడియాల ప్రభాకర్...
By Pagadala Venkateswar 2026-07-11 04:07:35 0 124
Telangana
హన్మాజిపేటలో వేడుకల సందడి: ఘనంగా కోడం దంపతుల షష్ఠిపూర్తి
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో, నా అన్నవారే దూరమవుతున్న రోజుల్లో.. ఉమ్మడి కుటుంబం అనే మాటే...
By Kodam Prasad 2026-05-06 17:17:52 0 312
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com