బస్సు ఆపకుండా వెళ్ళిపోయినందుకు బస్సు డ్రైవర్ ని చెప్పుతో కొట్టిన మహిళ

0
189

*ఆర్టీసీ డ్రైవర్ పై చెప్పుతో కొట్టిన మహిళ.*

 

 

బస్సు ఆపలేదనే కారణంతో ఆర్టీసీ డ్రైవర్ పై మహిళ చెప్పుతో కొట్టిన ఘటన మోపిదేవిలో శుక్రవారం చోటు చేసుకుంది.

 

సేకరించిన వివరాల మేరకు అవనిగడ్డ నుంచి విజయవాడ వెళుతున్న కరకట్ట బస్సును పులిగడ్డ వంతెనపై మహిళ బస్సు ఎక్కడానికి ఆపింది. కానీ బస్సు ఆపకుండా డ్రైవర్ వెళ్లిపోయాడు. దీంతో మహిళ బస్సును వెంబడిస్తూ, మోపిదేవి ప్రధాన సెంటర్లో బస్సు ఎక్కి, డ్రైవర్ ను చెప్పుతో చెంప మీద కొట్టింది. అంతటితో ఆగని సదరు మహిళ తన బంధువులకు ఫోన్ చేసి చల్లపల్లి బస్ స్టాప్ కు పిలిపించి వారితో డ్రైవర్ ను కొట్టించింది. దీంతో బస్ స్టాప్ లో కొద్దిసేపు ఆర్టీసీ ఉద్యోగులు, మహిళకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

 

మహిళకు బంధువైన ఒక కానిస్టేబుల్ సదరు గొడవలో ఎంటరై, పంచాయితీ స్టేషన్ వరకు వెళ్లకుండా సర్దుబాటు చేశారు.

 

బస్సు ఆపనంత మాత్రాన డ్రైవర్ ను కొడతారా....... కొట్టిస్తారా....... అంటూ ఉద్యోగులు వాపోతున్నారు. చివరకు ఏమవుతుందో వేచి చూడవలసిందే.

Search
Categories
Read More
Jharkhand
Judicial Shake-up: HC Orders 262 Fresh Probes into Custodial Deaths
In a landmark move for human rights, the Jharkhand High Court has ordered fresh judicial...
By Dunna Jessicaruth 2026-05-15 09:49:35 0 117
Andhra Pradesh
చిత్తూరు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన రవాణా యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు చిత్తూరు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్...
By Benguluri Madhubabu 2026-02-22 09:46:05 0 231
Telangana
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సిఐటియు
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సిఐటియు    కుమ్మరి కుంట నాగన్న ...
By Kadari Komuravelli 2026-03-23 12:04:24 0 484
Andhra Pradesh
Chandrababu Naidu: నేరపూరిత రాజకీయాలే వైసీపీ సంస్కృతి: సీఎం చంద్రబాబు.
          Chandrababu Naidu: నేరపూరిత రాజకీయాలే వైసీపీ సంస్కృతి:...
By Pagadala Venkateswar 2026-02-02 05:03:38 0 200
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:చౌడేపల్లిలో బలిజ వర్గం ప్రభావ రాబోయే ఎన్నికల్లో రసవత్తరం
చౌడేపల్లి గ్రామంలో బలిజ వర్గం అధిక సంఖ్యలో ఉండటంతో రాబోయే ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. ఈ...
By Kothuru Murali 2026-03-26 14:37:48 0 178
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com