హిందూ స్మశాన వాటికను కాపాడండి - కాలనీవాసుల మొర.|

0
9

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా : ఆల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలో నూతనంగా ఏర్పాటు అయిన 190 డివిజన్ లో గతంలో హిందూ స్మశానవాటిక గురించి తుర్కపల్లి బంధం బావి వద్ద సర్వే నంబర్ 8 లో సుమారు 2.38 ac (రెండు ఎకరాల ముప్పై ఎనిమిది గుంటలు) హిందూ స్మశానవాటికను తుర్కపల్లి, బంధం బావి, పెన్షన్ పుర, బుడగ జంగాల కాలనీ వాసులకోసం ఏర్పాటు చేశారు.ఇప్పుడు ఈ స్మశాన వాటికలో దాదాపు 1.38 ac (ఎకరా ముప్పై ఎనిమిది గుంటలు) ఆక్రమించుకొని ఇళ్ల నిర్మాణాలు చేసుకున్నారు. మిగితా ఎకరం కూడా అణ్యాక్రాంత మవుతోంది. కనీసం వున్న ఈ కాస్త భూమినైనా కాపాడాలని కాలనీల వాసులు డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కొన్ని నెలలుగా దీనిపై రాజకీయ నాయకులకు, అధికారులకు ఎన్ని సార్లు విన్నవించుకున్న పలితం లేదని వాపోయారు. వున్న స్మశాన వాటికలో అంత్యక్రియలు అయిన తర్వాత కనీసం శుభ్రపరుచు కోవడానికి నీటి వసతి కూడా లేదని తెలిపారు. 

ఇప్పటి కైనా అధికారులు స్పందించి ఒక బోరు నీటి సౌకర్యంతో పాటు, చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి కనీస వసతులను కల్పిస్తూ, ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 

ఈ ధర్నా కార్యక్రమంలో.. మహేష్, సూర్యకుమార్, కొలపురం నర్సంగ్రావు, చంద్ర కుమార్, భాస్కర్, బాలయ్య, బలరాం,శోభన్ బాబు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్
For scrolls   అమరావతి   *కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని...
By Rajini Kumari 2025-12-17 09:36:56 0 3
Telangana
పాలు పలిగాయని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కూకట్ పల్లి పోలీసులు
కూకట్‌పల్లిలో హెరిటేజ్ పాకెట్ పాలు పగిలిపోయాయని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన బాధితులు. ...
By Sidhu Maroju 2025-06-24 12:38:15 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com