బాలల సంరక్షణ కేంద్రాల్లో జిల్లా స్థాయి కమిటీ తనిఖీలు

0
20

*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌*

*ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబర్ 16, 2025*

 

*బాలల సంరక్షణ కేంద్రాల్లో జిల్లా స్థాయి కమిటీ తనిఖీలు*

 

ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న నిర్మల శిశు భవన్, మాంగో హోమ్, బేతనీ హోమ్ మరియు దీపనివాస్ బాలల సంరక్షణ కేంద్రాలను జాయింట్ కలెక్టర్ మరియు కమిటీ చైర్మన్ ఎస్.ఇలక్కియ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీ తనిఖీలు నిర్వహించారు. ముందుగా నిర్మల శిశు భవన్ ను సందర్శించి అందులో ఉన్న ప్రత్యేక అవసరాల కలిగిన బాలలకు అందించే వైద్యం, ఆహారం, ఆరోగ్య పరిస్థితి గురించి జాయింట్ కలెక్టర్ ఆరా తీశారు. ప్రతిరోజు ఆకుకూరలు, కూరగాయలు మరియు ప్రోటీన్స్ కలిగిన ఆహారం అందించాలని సూచించారు. కిచెన్, స్టోర్ రూమ్ లు మరియు మరుగుదొడ్లు శుభ్రంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి కేంద్రాలలో బాలలు ఆటలు ఆడుకోవటానికి అవసరమైన స్థలం ఉండాలని సూచించారు. రిజిస్టర్లను చెక్ చేసి, జూవినెల్ జస్టిస్ చట్టం నియమ నిబంధనలు ప్రకారం అన్ని రిజిస్టర్లు ఉండేవిధంగా ఉండాలని ఆదేశించారు. తరువాత బాలలతో ముఖాముఖీ మాట్లాడి ఈ కేంద్రాలు అందిస్తున్న సదుపాయాలు అడిగి తెలుసుకున్నారు. మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని బాలలను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో

జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి షేక్ రుక్సానా సుల్తానా బేగం, డీసీపీవో ఎం.రాజేశ్వరరావు, వి.అన్నమణి, డా. మీనా, డా. సురేష్, కిరణ్ కుమార్, ప్రభాకర్ తదితరులు 

 పాల్గొన్నారు.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com