బాలల సంరక్షణ కేంద్రాల్లో జిల్లా స్థాయి కమిటీ తనిఖీలు

0
264

*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌*

*ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబర్ 16, 2025*

 

*బాలల సంరక్షణ కేంద్రాల్లో జిల్లా స్థాయి కమిటీ తనిఖీలు*

 

ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న నిర్మల శిశు భవన్, మాంగో హోమ్, బేతనీ హోమ్ మరియు దీపనివాస్ బాలల సంరక్షణ కేంద్రాలను జాయింట్ కలెక్టర్ మరియు కమిటీ చైర్మన్ ఎస్.ఇలక్కియ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీ తనిఖీలు నిర్వహించారు. ముందుగా నిర్మల శిశు భవన్ ను సందర్శించి అందులో ఉన్న ప్రత్యేక అవసరాల కలిగిన బాలలకు అందించే వైద్యం, ఆహారం, ఆరోగ్య పరిస్థితి గురించి జాయింట్ కలెక్టర్ ఆరా తీశారు. ప్రతిరోజు ఆకుకూరలు, కూరగాయలు మరియు ప్రోటీన్స్ కలిగిన ఆహారం అందించాలని సూచించారు. కిచెన్, స్టోర్ రూమ్ లు మరియు మరుగుదొడ్లు శుభ్రంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి కేంద్రాలలో బాలలు ఆటలు ఆడుకోవటానికి అవసరమైన స్థలం ఉండాలని సూచించారు. రిజిస్టర్లను చెక్ చేసి, జూవినెల్ జస్టిస్ చట్టం నియమ నిబంధనలు ప్రకారం అన్ని రిజిస్టర్లు ఉండేవిధంగా ఉండాలని ఆదేశించారు. తరువాత బాలలతో ముఖాముఖీ మాట్లాడి ఈ కేంద్రాలు అందిస్తున్న సదుపాయాలు అడిగి తెలుసుకున్నారు. మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని బాలలను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో

జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి షేక్ రుక్సానా సుల్తానా బేగం, డీసీపీవో ఎం.రాజేశ్వరరావు, వి.అన్నమణి, డా. మీనా, డా. సురేష్, కిరణ్ కుమార్, ప్రభాకర్ తదితరులు 

 పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Ravindra Singh Yadav: Leading Andaman Police Forward
A distinguished AGMUT cadre IPS officer, Ravindra Singh Yadav serves as the Director General of...
By Lokeshwari Panthadi 2026-07-24 06:39:17 0 220
Maharashtra
Massive Digital Shift: Over 11 Lakh Families Complete Census Self-Enumeration
Maharashtra is embracing a major digital transition. Official data released today confirms that...
By Dunna Jessicaruth 2026-05-18 09:48:25 0 126
Andhra Pradesh
తిరుపతి లడ్డు కల్తీ విషయంలో శిక్ష తప్పదు మంత్రి సవిత హెచ్చరిక
*తిరుపతి లడ్డూ కల్తీలో శిక్ష తప్పదు*   * జగన్ కు మంత్రి సవిత హెచ్చరిక * కల్తీ నెయ్యి...
By Rajini Kumari 2026-02-06 09:40:13 0 181
Andhra Pradesh
బళ్లారిలో నారా లోకేశ్ కు ఘన స్వాగతం.. కాసేపట్లో సుజ్లాన్ బ్లేడ్ యార్డును సందర్శించనున్న లోకేశ్.
ఏపీ మంత్రి నారా లోకేశ్ కర్ణాటకలోని బళ్లారిలో పర్యటిస్తున్నారు. ఈ ఉదయం బళ్లారిలోని జిందాల్...
By Pagadala Venkateswar 2026-08-25 06:30:21 0 100
Andhra Pradesh
రూ.18.54 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ LOCలను పంపిణీ చేసిన డా గొట్టిపాటి లక్ష్మీ
రూ.18.54 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ LOCలను పంపిణీ చేసిన డా గొట్టిపాటి లక్ష్మీ కురిచేడు మండలం,...
By Chennaiah Kati 2026-07-03 05:06:27 0 97
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com