నార్త్ జోన్ డిసిపి రష్మీ పెరుమాళ్ ప్రెస్ మీట్.|

0
7

సికింద్రాబాద్ : ఉత్తర మండల పరిధిలోని కార్ఖానా, బొల్లారం పోలీస్ స్టేషన్ లలో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుల నుండి 31 లక్షల విలువైన బంగారు,వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు.

బోయిన్ పల్లి కి చెందిన శ్రీధర్ అనే ఆభరణాల వ్యాపారి ఇంట్లో పనిమనిషిగా ఉన్న మాధవి, ఆమె భర్త కృష్ణయ్య లు పక్కా ప్రణాళిక ప్రకారం పలు దఫాలుగా బంగారు ఆభరణాలను, బిస్కెట్లను దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దొంగతనం చేసిన సొమ్మును కరిగించి విక్రయిస్తున్న క్రమంలో పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. 

మరొక కేసులో మచ్చ బొల్లారం ప్రాంతానికి చెందిన సింధు అనే మహిళ ఇళ్లలో పనిచేస్తూ బంగారు ఆభరణాలను అపహరించినట్లు ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు.

బొల్లారంలో నివాసం ఉంటే సుజాత అనే మహిళ ఇంట్లో 15 తులాల బంగారు, వంద తులాల వెండి ఆభరణాలు అల్మారాలో కనిపించకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంట్లో పనిమనిషిగా ఉన్న సింధును విచారించగా దొంగతనం చేసినట్లు వెళ్లడైంది. ఈ కేసులో ఆమెను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

ఇలాంటి దొంగతనాలను అరికట్టాలంటే ఇళ్లలో పని మనుషులను చేర్చుకునే ముందు వారి గురించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలని సూచించారు. కాలానుగుణంగా విలువైన వస్తువులను తరచు తనిఖీ చేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు.

Sidhumaroju.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com