ఇంధన పొదుపు వారోత్సవాలు !!

0
43

కర్నూలు : కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఎ. సిరి, విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ వాడకంలో పొదుపుపై అవగాహన కల్పించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునంద ఆడిటోరియంలో ఇంధన పరిరక్షణ మరియు సంరక్షణకు సంబంధించిన వార్షికోత్సవాల పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ ఇంధన పొదుపు వార్షికోత్సవాలు ఈ నెల 14 నుండి 20 వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోజురోజుకు విద్యుత్ వాడకం అధికం అవుతున్న నేపథ్యంలో విద్యుత్ వృథా కాకుండా ఆదా చేసుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఈ  సందర్భంగా చెప్పారు.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com