పూర్ణాహుతి తో ఘనంగా ముగిసిన భవానీ దీక్ష ఉత్సవాలు

0
47

*పూర్ణాహుతితో వైభవంగా* 

 *ముగిసిన భవానీ దీక్షల ఉత్సవాలు*

                

 

 

 విజయవాడ దుర్గ గుడి, డిసెంబర్ 15. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అత్యంత వైభవంగా జరిగిన భవానీ దీక్షల విరమణ కార్యక్రమాలు ఐదవ రోజు సోమవారం పూర్ణాహుతితో దిగ్విజయంగా ముగిశాయి. శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలతో కృష్ణమ్మ ఒడిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.

దేవస్థానం స్థానాచార్యులు శివ ప్రసాద్, ప్రధాన అర్చకులు దుర్గా ప్రసాద్ ఇతర వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో పాత యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించబడింది. ఉప ప్రధాన అర్చకులు, ముఖ్య అర్చకులు శాస్త్రం ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో భవానీ దీక్షలు శుభప్రదంగా ముగిశాయి.

ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి 

వి.కె. సీనా నాయక్ ముఖ్య పండుగ అధికారి మూర్తి ( ద్వారకా తిరుమల), ట్రస్ట్ బోర్డు సభ్యులు దుర్గమ్మ దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. *పూర్ణాహుతి అనంతరం పండితులు, అర్చకులు భక్తులకు, అధికారులకు వేద ఆశీర్వచనం అందించారు*

Search
Categories
Read More
Telangana
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ దే విజయం: ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్ : కంటోన్మెంట్  ఉప ఎన్నికల మాదిరిగానే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ విజయకేతనం...
By Sidhu Maroju 2025-10-07 11:30:02 0 93
Telangana
గవర్నర్ ప్రోగ్రాంలో ప్రోగ్రాంలో ఫేక్ రిపోర్టర్ కలకలం.|
హైదరాబాద్ :  హైటెక్ సిటీ – ఆవాస హోటల్‌లో జరిగిన గవర్నర్ ప్రోగ్రాంలో నేషనల్ మీడియా...
By Sidhu Maroju 2025-11-28 17:34:23 0 59
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com