నేడు విజయవాడ సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో బాబురావు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కాశీనాథ్ పాల్గొన్నారు
*విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించకపోతే కనెక్షన్ల తొలగిస్తామని సర్కార్ నోటీసులు*
*బలవంతంగా మీటర్ల బిగించబోమని హామీ ఇచ్చిన మంత్రి*
*స్మార్ట్ మీటర్ల పై మాట తప్పిన కూటమి ప్రభుత్వం*
*ప్రతిపక్షంలో ఉండగా స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని పిలుపు, నేడు బలవంతంగా మీటర్ల బిగింపు*
*అదానికి దాసోహం అంటున్న కూటమి సర్కార్*
*స్మార్ట్ మీటర్లు విద్యుత్ భా రాలపై పోరాటం ఉదృతం*
_సిహెచ్ బాబురావు, సిపిఎం
రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
#నేడు విజయవాడ సిపిఎం
జిల్లా కార్యాలయంలో జరిగిన
పత్రికా విలేకరుల
సమావేశంలో బాబురావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కాశీనాథ్ పాల్గొని మాట్లాడారు#
#బాబురావు,కాశీ నాథ్ మాట్లాడుతూ.....
*ప్రతి ఇంటిలో విద్యుత్ స్మార్ట్ మీటర్ల రూపంలో ఆదానీ దోపిడీని కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతోంది*
*ఆంధ్రప్రదేశ్ ను అధానీప్రదేశ్ గా సర్కార్ మారుస్తోంది*
*రాష్ట్రములోని రెండు కోట్ల మంది వినియోగదారులకు బాగున్న మీటర్లు తొలగించి, స్మార్ట్ మీటర్లు బిగించడానికి ప్రభుత్వం కుట్ర పన్నింది*
*స్మార్ట్ మీటర్ల ద్వారా 25 వేల కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రజలపై కూటమి మోపుతోంది*
*కేంద్ర ప్రభుత్వం, మోడీ మెప్పుకోసం, ఆదానీ సంస్థతో కుమ్మక్కై రాష్ట్ర ప్రజలను బలి చేస్తున్నది*
*ప్రతిపక్షంలో ఉండగా లోకేష్ తో సహా టిడిపి, కూటమి నేతలు స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని పిలుపునిచ్చారు*
*ప్రజల అంగీకారం లేకుండా స్మార్ట్ మీటర్లు బిగించబోమని విద్యుత్ శాఖ మంత్రి హామీ ఇచ్చారు*
*కూటమి మాట తప్పింది, నమ్మకద్రోహం చేసింది, నేడు బలవంతంగా మీటర్లు బిగిస్తున్నారు*
*విజయవాడ నగరంలో విద్యుత్ అధికారులు స్మార్ట్ మీటర్లు బిగించకపోతే మూడు రోజుల్లో విద్యుత్ కనెక్షన్లు నిలిపివేస్తామని నోటీసులు ఇవ్వడం దారుణం*
*దొడ్డిదారిన, మోసగించి, ప్రజల కళ్ళుగప్పి మీటర్ల బిగింపుకు పూనుకుంటున్నారు, భ్రమలు కల్పిస్తున్నారు, బిగించకపోతే సహించమని హెచ్చరిస్తున్నారు, బెదిరిస్తున్నారు*
*మీటర్ల రిపేరు సాకుతో స్మార్ట్ మీటర్లు బిగించడం మోసపూరితం*
*కొత్తగా ఇచ్చే కనెక్షన్లకు, సోలార్ కనెక్షన్లకు బలవంతంగా స్మార్ట్ మీటర్లు బిగించడం శోచనీయం*
*స్మార్ట్ మీటర్ల బిగింపు చట్ట విరుద్ధం, హామీలకు విరుద్ధం*
*స్మార్ట్ మీటర్ల ద్వారా విద్యుత్ పంపిణీ మొత్తాన్ని ఆదాని, కార్పొరేట్లకు అప్పగించడానికి, ప్రైవేటీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నాయి*
*ఇప్పటికే కూటమి ప్రభుత్వం 18 నెలల్లో 24 వేల కోట్ల రూపాయలు సర్దుబాటు చార్జీలు, విద్యుత్ సుంకం ఇతర రూపాలలో అదనపు భారాలు మోపింది*
*మరో 12717 కోట్ల రూ.. ట్రూ అప్ చార్జీల విధింపుకు రంగం సిద్ధం అయ్యింది*
*విద్యుత్ స్మార్ట్ మీటర్ కు అయ్యే ఖర్చు 8 వేల నుండి 15 వేల రూ.. వరకు వినియోగదారులపై వేసి 93 నెలలో వాయిదాల పద్ధతిలో వసూలు చేస్తారు*
*విధ్యుత్ వ్యయం తగ్గిస్తామని, చార్జీలు, భారాలు తగ్గిస్తామని మాట ఇచ్చిన చంద్రబాబు... స్మార్ట్ మీటర్ల ద్వారా వ్యయం పెంచడం, ప్రజలపై భారం మోపటం మోసపూరితం కాదా?*
*ప్రీపెయిడ్ పద్ధతిలో ముందుగానే ఆదానీ సంస్థ ప్రజల నుండి ముందస్తు చార్జీలు వసూళ్లకు పూను కుంటుంది*
*టైమ్ ఆఫ్ ది డే ప్రకారం అధిక విద్యుత్ వినియోగించే సమయంలో యూనిట్ కి అధిక రేట్లు వసూళ్లు వ్యాపార సంస్థల నుండి ఇప్పటికే ప్రారంభించారు*
*స్మార్ట్ మీటర్ల బిగింపు ద్వారా ప్రతి వినియోగదారుడు కి గంట గంటకి రేట్లు నిర్ణయించి ప్రజలను దోచుకుంటారు*
*ప్రజా పోరాటం వల్ల వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ఆగింది*
*రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ప్రజల నిరసనలతో స్మార్ట్ మీటర్ల బిగింపు నివాసాలకు నిలిచిపోయింది*
*ప్రజల కళ్ళుగప్పి పలుచోట్ల మోసపూరితంగా బిగించడానికి ప్రభుత్వం అదానీ సంస్థ మళ్లీ కుట్రలు ప్రారంభించాయి*
*ప్రజలు అప్రమత్తంగా ఉండి స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలి*
*ఎక్కడకక్కడ ప్రతిఘటించాలి, తిప్పి కొట్టాలి, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను నిలదీయాలి*
*ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి స్మార్ట్ మీటర్ల పై స్పందించాలి*
*స్మార్ట్ మీటర్ల బిగింపు పై ఇచ్చిన నోటీసులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి*
*ఇప్పటికే విద్యుత్ రంగంలో బొగ్గు కాంట్రాక్టులు, విదేశీ బొగ్గు దిగుమతి, పోర్టుల ద్వారా రవాణా, లారీ ట్రాన్స్పోర్ట్, సోలార్ విద్యుత్ ఒప్పందాలు, ఇప్పుడు స్మార్ట్ మీటర్ల ఒప్పందాలు మొత్తం అదానీ సంస్థ కైవసం చేసుకున్నది*
*విద్యుత్ రంగాన్ని కబళిస్తున్నది, మోడీ ప్రభుత్వం అండతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదానీప్రదేశ్ గా మార్చుతున్నారు*
*పోర్టులు, విమానాశ్రయాలు, డేటా సెంటర్లు, సిమెంటు రంగం ఇతర అనేక రంగాల్లో అదాని సంస్థ గుత్తాధిపత్యం వహిస్తున్నది*
*ఇండిగో విమాన సంక్షోభం ద్వారా కార్పొరేట్ల గుత్తాధిపత్యం ఎంత ప్రమాదకరమో దేశానికి అర్థమయ్యింది*
*అయినా బిజెపి, మోడీ, ఎన్ డి ఏ సర్కార్ ఏకపక్షంగా ఆదాని, కార్పొరేట్లకు కొమ్ముగాస్తున్నారు*
*రాష్ట్రంలోని కూటమి పార్టీలు కేంద్రానికి వత్తాసు పలికి, అదానీకి లొంగిపోయారు*
*రాష్ట్రంలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వంటి బడా సంస్థలకు గత ప్రభుత్వం కంటే ఎక్కువగా కూటమి ప్రభుత్వం లొంగిపోయింది*
*2024లో ఎన్నికలకు ముందు షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ తెలుగుదేశం పార్టీకి 40 కోట్ల రూపాయలు ఎలక్టరాల్ బాండ్స్ ద్వారా ఆర్థిక సహాయం అందించింది*
*గతంలో వైసిపి ప్రభుత్వం ఆదానీ సంస్థ నుండి ముడుపులు తీసుకుని ఏడువేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఒప్పందానికి పూనుకున్నది*
*కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం.. అదాని, శిరిడీసాయి ఎలక్ట్రికల్ సంస్థలకు పూర్తిగా దాసోహం అంటున్నాయి*
*రాష్ట్ర ప్రజలను బలి తీసుకుంటున్నాయి, విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేస్తున్నాయి*
*శాశ్వతంగా విద్యుత్ భారాలు మోపి, స్మార్ట్ మీటర్ల ద్వారా అదానీ కబంధహస్తాల్లో రాష్ట్రాన్ని, వినియోగదారులను బిగిస్తున్నారు*
*ఈ ప్రమాదాన్ని గమనించి ప్రజలందరూ ఉద్యమించాలి, పాలకులను నిలదీయాలి*
*సిపిఎం, వామపక్షాలు ప్రజలందరితో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తాయి*
*స్మార్ట్ మీటర్లను అడ్డుకోవాలి, తిప్పి కొట్టాలి*
*స్మార్ట్ మీటర్ల బిగింపు పై ఇచ్చిన నోటీసులు రద్దు చేయాలి, పెట్టిన మీటర్లు తొలగించాలి, స్మార్ట్ మీటర్ల ఒప్పందాలు రద్దు చేయాలి*
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy