పిన్నెల్లి సోదరులు నరహంతకులు రాష్ట్ర ప్రజలు వారి అరెస్టు స్వాగతిస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న

0
53

*ప్ర‌చుర‌ణార్థం* 14-12-2025*

 

 

పిన్నెల్లి సోద‌రులు న‌ర‌హంత‌కులు....రాష్ట్ర ప్ర‌జ‌లు వారి అరెస్ట్ స్వాగ‌తిస్తున్నారు : మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న‌

కొవ్వొత్తుల ప్రదర్శనకు పిలుపు నిచ్చిన‌ పులివెందుల ఎమ్మెల్యే జ‌గ‌న్ పై మండిప‌డ్డ బుద్ధా

పిన్నెల్లి అరాచ‌కాల‌కు వై.ఎస్.జ‌గ‌న్ బాధ్యుడు

జగన్ ఒక రాక్షసుడైతే, పిన్నెల్లి సోదరులు నరరూప రాక్షసులు..

 

 

విజ‌య‌వాడ : మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి, ఆయ‌న సోద‌రుడు వెంక‌ట రామి రెడ్డి ఇద్ద‌రు న‌రరూప రాక్షసులైతే, పులివెందుల ఎమ్మెల్యే వై.ఎస్.జ‌గ‌న్ రెడ్డి మ‌రోర‌కం రాక్ష‌సుడు. పిన్నెల్లి సోద‌రుల‌కు ద‌య‌,క‌ర‌ణ అన్న‌దే వుండ‌దు..వీరికి బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల ప్ర‌జ‌లంటే చుల‌క‌న....అందుకే వారి అరెస్ట్ ను రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ స్వాగ‌తిస్తున్నారు. మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు దీపావ‌ళి పండుగ జ‌రుపుకుంటున్నార‌ని మాజీ ఎమ్మెల్సీ టిడిపి రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుద్ధా వెంక‌న్న అన్నారు.

 

పిన్నెల్లి సోదరులు అరెస్ట్ కు సంఘీ భావం పులివెందుల ఎమ్మెల్యే జ‌గ‌న్ రెడ్డి కొవ్వుత్త‌ల ప్ర‌ద‌ర్శ‌న‌కు పిలుపునివ్వ‌టాన్ని ఖండిస్తూ ఆదివారం ఎంపీ కేశినేని శివ‌నాథ్ కార్యాల‌యంలో మీడియా సమావేశం నిర్వ‌హించారు.

 

 

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పిన్నెల్లి సోదరులు మున్సిపల్ ఛైర్మన్ కోసం వేలం పాట పెట్టి దాడులు హత్యలు చేయించిన దుర్మార్గులు అన్నారు. వారిని నడిపించిన రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి అంటూ మండి ప‌డ్డారు. గ‌త ప్ర‌భుత్వంలో ఈ రాక్షసులు అంతా కలిసి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో పిన్నెల్లి సోదరులు అరెస్టు చేస్తే... ఇది అక్ర‌మ నిర్భందం అన‌టం జ‌గ‌న్ కి ప్ర‌జాస్వామ్యంపై చ‌ట్టాల‌పై ఎంతో గౌర‌వం వుందో అర్ధ‌మ‌వుతుంద‌న్నారు.

 

 రాష్ట్రంలో టీడీపీ మద్దతు దారులను చంపేయాలని లక్ష్యంగా పెట్టుకొని పిన్నెల్లి బ్రదర్స్ వ్య‌వ‌హ‌రించార‌న్నారు. ఒక కులాన్ని టార్గెట్ చేసుకుని పచ్చి బూతులు మాట్లాడిన చరిత్ర వాళ్ల సొంతమ‌న్నారు. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సామాజిక వ‌ర్గం పైనా కూడా దుర్మార్గాల‌కు తెగ‌బ‌డ్డార‌ని తెలిపారు. త‌న‌పై ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు దాడి చేయించిన‌ వీడియోలు వున్నాయ‌న్నారు. తుర‌క కిషోర్ హ‌త్య వెన‌క పిన్నెల్లి సోద‌ర‌లే వున్నారు. జై వైసిపి అన‌లేద‌ని చంద్ర‌య్య గొంతు కోసి చంపేశార‌న్నారు. పిన్న‌ల్లి సోద‌రులు వైసిపి పాల‌న‌లో కులాల‌ను ల‌క్ష్యంగా పెట్టుకుని దాడులు చేశార‌న్నారు.

 

 

ఇద్దరు వ్యక్తులను అత్యంత కిరాతకంగా చంపిన వారిని అరెస్టు చేస్తే.. ఆ దుర్మార్గులకు జగన్ సంఘీభావం ప్రకటించటం విడ్డూరంగా వుంద‌న్నారు.పిన్నెల్లి సోద‌రులు ఏమైనా స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులా, కొవ్వోత్తుల ప్ర‌ద‌ర్శ‌న‌కు పిలుపు ఇవ్వటానికి అంటూ ప్ర‌శ్నించారు. పిన్నెల్లి బ్రదర్స్ కు అండ‌గా వున్న జగన్ ... నైజం ఏమిటో ప్రజలు అర్దం చేసుకోవాలని సూచించారు. పిన్నెల్లి అరాచ‌కాల‌ను క‌ప్పిపుచ్చేందుకు ఎమ్మెల్యే జ‌గ‌న్ డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తున్నార‌ని తెలిపారు. ఈ రాష్ట్రంలో జగన్ నాయకత్వాన్ని బలపరచడం అంటే.. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినట్లేన‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌లు జ‌గ‌న్ స‌మావేశాల‌కు, యాత్ర‌ల‌కు వెళ్లొద్ద‌న్నారు.

 

 మోడీ సహకారంతో సీఎం చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో రాష్ట్రం గాడిలో ప‌డుతుంద‌న్నారు . డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్‌, మంత్రి నారా లోకేష్ లు ఈ రాష్ట్రం బాగు కోసం నిత్యం కృషిచేస్తున్నారని తెలిపారు. బుషులు యాగం చేస్తుంటే రాక్షసులు నాశనం చేసినట్లుగా,... చంద్రబాబు రాష్ట్రాన్ని బాగుచేస్తుంటే.. జగన్ అనే రాక్షసుడు రాష్ట్రాన్ని నాశనం చేయాలని అడ్డంకులు కలిగిస్తున్నాడన్నారు. జ‌గ‌న్ దారుణాల‌కు విసిగిపోయి ప్ర‌జ‌లు 11 సీట్ల‌కు ప‌రిమితం చేశారు. ఈ సారి ఒక సీటు ఇవ్వ‌టం సందేహ‌మే అన్నారు.

 

ఆరు నెల‌ల త‌ర్వాత వైసిపి ను బ‌లోపేతం చేసి...వై.ఎస్.జ‌గ‌న్ ను మ‌రోసారి సీఎం చేసేందుకు ప‌నిచేస్తామంటూ ప్ర‌గ‌ల్బాలాలు ప‌లికిన వైసిసి నాయ‌కులు కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేన‌ని వంశీల‌కు త‌న‌దైన శైలిలో చ‌ర‌కులు అంటించారు. ఒక‌రికి గుండె స‌రిగా ప‌నిచేయ‌దు..ఇంకొక‌రికి ఊపిరితిత్తులు,వెన్నుపూస‌ దెబ్బ‌తిన్నాయి. బూస్ట్‌లు, కోడిగుడ్లు తిని ఆరు నెలల్లో జగన్‌ను సీఎం చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు.. కొడాలి నాని, వంశీ ఇంత బలహీనంగా ఉంటే… వారి నాయకుడు ఎంత బలహీనంగా ఉన్నాడో అర్థమవుతోందన్నారు. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావ‌టం క‌ల అంటూ స్ఫ‌ష్టం చేశారు. ఇప్పుడు ఉన్నది ప్రజా క్షేమం కోరే ఎన్డీయే కూటమి ప్రభుత్వం...ప్ర‌జ‌లు వైసిపి నాయ‌కులు విశ్వ‌సించే ప‌రిస్థితిలో లేర‌న్నారు. పిన్నెల్లి వంటి రౌడీ షీటర్లు, దుర్మార్గులకు అండ‌గా వుంటూ

 వారిని కాపాడుతున్న జగన్ ను, వైసిపి కి అడ్రస్ లేకుండా చేయాలని ప్ర‌జ‌ల‌కు పిలుపు నిచ్చారు.

Like
1
Search
Categories
Read More
Entertainment
Renowned Assamese Singer Gayatri Hazarika Passes Away at 44, Tributes Pour In
Renowned Assamese Singer Gayatri Hazarika Passes Away at 44, Tributes Pour In The Assamese music...
By BMA ADMIN 2025-05-21 13:37:06 0 2K
Andhra Pradesh
సీనియర్ నేత టిడిపి నుండి బీజేపీలో చేరిన గజేంద్ర గోపాల్
గూడూరు పట్టణానికి చెందిన సీనియర్ టిడిపి నేత, మాజీ పట్టణ అధ్యక్షుడు కడియాల బోయ గజేంద్ర గోపాల్...
By mahaboob basha 2025-08-31 01:00:07 0 294
Bharat Aawaz
భారత్ Vs. ఇండియా: పాత్రికేయుని స్థానం ఎక్కడ? ( Bharat Vs. India: Where is the Journalist's Position? )
భారత్ Vs. ఇండియా: పాత్రికేయుని స్థానం ఎక్కడ?( Bharat Vs. India: Where is the Journalist's...
By Bharat Aawaz 2025-07-08 17:58:50 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com