లోక్ అదాలత్ లో 200746 కేసుల పరిష్కారం

0
144

కర్నూలు : రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్లకు విశేష స్పందన లభించింది. శనివారం ఒక్కరోజే 2,00,746 కేసులు పరిష్కారమయ్యాయి. మొత్తం రూ 52.56 కోట్ల పరిహారం అందజేశారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, ఏపీ న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వహణ అధ్యక్షులు జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథాయ్, హైకోర్టు న్యాయసేవల కమిటీ అధ్యక్షులు జస్టిస్ ఎన్.రవినాథ్ తిల్హరి మార్గదర్శకంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దిగువ న్యాయస్థానాల్లో 431 లోక్ అదాలత్ బెంచ్లు నిర్వహించారు. ఇరువర్గాల ఆమోదంతో రాజీకి అవకాశం ఉన్న కేసులను పరిష్కరించారు. హైకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన లోక్ అదాలత్లో న్యాయమూర్తులు జస్టిస్ కుంచెం మహేశ్వరరావు, జస్టిస్ వై. లక్ష్మణరావు పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న 150 కేసులు పరిష్కరించి రూ 2.81 కోట్ల పరిహారం అందజేశారు. లోక్ అదాలత్ లు విజయవంతమవడానికి సహకరించిన న్యాయవాదులు, కక్షిదారులు, అధికారులకు న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి బీఎస్పీ హిమబిందు, హైకోర్టు న్యాయసేవల కమిటీ కార్యదర్శి జి.మాలతి కృతఙ్ఞతలు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
కార్ఖానా పిఎస్ పరిధిలో భారీ చోరీ.|
సికింద్రాబాద్ : కార్ఖానా  పి ఎస్ పరిధిలో నేపాలీ ముఠా చోరీ. దాదాపు 50 లక్షల విలువైన...
By Sidhu Maroju 2025-11-16 07:26:06 0 41
Telangana
ప్రమాదవకరంగా ఏర్పడ్డ రాళ్లగుట్ట : పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
    సికింద్రాబాద్ : మోండా డివిజన్ పరిధిలోని ఈస్ట్ మారేడ్ పల్లి వడ్డెర బస్తి ప్రాంతంలో...
By Sidhu Maroju 2025-11-03 12:25:31 0 71
Telangana
బిఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ మాగంటి గోపీనాథ్ కన్నుమూత
మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం పని చేస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం ఐదు...
By Vadla Egonda 2025-06-08 02:23:57 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com