లోక్ అదాలత్ లో 200746 కేసుల పరిష్కారం

0
309

కర్నూలు : రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్లకు విశేష స్పందన లభించింది. శనివారం ఒక్కరోజే 2,00,746 కేసులు పరిష్కారమయ్యాయి. మొత్తం రూ 52.56 కోట్ల పరిహారం అందజేశారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, ఏపీ న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వహణ అధ్యక్షులు జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథాయ్, హైకోర్టు న్యాయసేవల కమిటీ అధ్యక్షులు జస్టిస్ ఎన్.రవినాథ్ తిల్హరి మార్గదర్శకంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దిగువ న్యాయస్థానాల్లో 431 లోక్ అదాలత్ బెంచ్లు నిర్వహించారు. ఇరువర్గాల ఆమోదంతో రాజీకి అవకాశం ఉన్న కేసులను పరిష్కరించారు. హైకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన లోక్ అదాలత్లో న్యాయమూర్తులు జస్టిస్ కుంచెం మహేశ్వరరావు, జస్టిస్ వై. లక్ష్మణరావు పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న 150 కేసులు పరిష్కరించి రూ 2.81 కోట్ల పరిహారం అందజేశారు. లోక్ అదాలత్ లు విజయవంతమవడానికి సహకరించిన న్యాయవాదులు, కక్షిదారులు, అధికారులకు న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి బీఎస్పీ హిమబిందు, హైకోర్టు న్యాయసేవల కమిటీ కార్యదర్శి జి.మాలతి కృతఙ్ఞతలు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
ఎన్నికల సిబ్బంది పై వీధి కుక్కల దాడి
కరీంనగర్ లో వీధి కుక్కల హల్చల్ SRR కాలేజ్ లో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర ఘటన ఆరుగురు...
By Bouth Arun 2026-02-11 06:25:54 0 418
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరులో రేపు అనగా 8 తేదీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అభివృద్ధి పనుల శంకుస్థాపన
శనివారం, మార్చి 8, 2026న ఉదయం 11:30 గంటలకు పుంగనూరు టౌన్ మార్కెట్ నందు పలు అభివృద్ధి మరియు...
By Kothuru Murali 2026-03-07 12:43:37 0 144
Andhra Pradesh
TTD: టీటీడీ ట్రస్టులకు భక్తుల భారీ విరాళాలు
    TTD: టీటీడీ ట్రస్టులకు భక్తుల భారీ విరాళాలు 10-02-2026 Tue 14:16 | Andhra TTD...
By Pagadala Venkateswar 2026-02-10 09:41:18 0 153
Delhi - NCR
Delhi-NCR Accelerates Metro and Regional Connectivity
Delhi-NCR is witnessing significant progress in metro expansion and regional connectivity...
By Fathima Safa 2026-06-25 11:45:30 0 81
Andhra Pradesh
అభివృద్ధి – సంక్షేమమే నా లక్ష్యం
అభివృద్ధి – సంక్షేమమే నా లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి P4...
By Chennaiah Kati 2026-07-23 15:52:30 0 29
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com