కైకలూరు నియోజకవర్గం పోలీస్ స్టేషన్లకు 50 లక్షలు అందజేసిన ఎమ్మెల్యే కామినేని

0
116

*కైకలూరు నియోజక వర్గ పోలీస్ స్టేషన్లకు 50 లక్షల రూపాయలు విలువైన 5 వాహనాల ను ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారికి అంద చేసిన కైకలూరు నియోజక వర్గం ఎమ్మెల్యే, గౌరవ శ్రీ కామినేని శ్రీనివాసరావు గారి చొరవ మరియు దాతల సహకారంతో, నియోజకవర్గంలోని ఐదు పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలను అందించే కార్యక్రమం ఈ రోజు 12.12.2025 కైకలూరు లో నిర్వహించినారు*

 

👉 కైకలూరు ఎమ్మెల్యే శ్రీ కామినేని శ్రీనివాసరావు గారు మరియు దాతల సహాయంతో సుమారు ₹50 లక్షల రూపాయల ఖరీదు చేసే 5 'నియో ఎన్ 10 బొలెరో (Bolero)' వాహనాలను ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ గారికి అధికారికంగా అందజేశారు.

 

👉ఈ 5 వాహనాలు కైకలూరు నియోజక వర్గంలోని ఆయా పోలీస్ స్టేషన్లకు కేటాయించ బడతాయి అని తెలియ చేసిన జిల్లా ఎస్పీ గారు 

 

👉ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్ గారు మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థకు దాతలు చేయూతనివ్వడం పై హర్షం వ్యక్తం చేశారు.

 

 👉 మారుతున్న ఆధునిక కాలానికి అనుగుణంగా పోలీసు ఉద్యోగ నిర్వహణను సమర్థవంతంగా, వేగవంతంగా నిర్వహించడానికి ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయి అని పేర్కొన్నారు.

 

👉ప్రజా-పోలీస్ సంబంధాలు ఈ వాహనాల ద్వారా నిరంతర పెట్రోలింగ్ సాధ్యమై, ప్రజా-పోలీస్ సత్సంబంధాలు మరింత బలపడతాయని ఆకాంక్షించారు.

 

👉 ఈ గొప్ప కార్యక్రమం విజయవంతం కావడానికి విశేష కృషి చేసిన కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ శ్రీ కామినేని శ్రీనివాసరావు గారిని జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.

 

పోలీస్ శాఖకు తోడ్పాటు అందించిన దాతలకు మరియు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ వాహనాలను ప్రజల సేవ కోసం వినియోగిస్తామని జిల్లా ఎస్పీ గారు హామీ ఇచ్చారు.

 

ఈ కార్యక్రమములో ఏలూరు డీఎస్పీ శ్రీ డి శ్రావణ్ కుమార్ గారు కైకలూరు టౌన్ ఇన్స్పెక్టర్ రామ కృష్ణ గారు కైకలూరు రూరల్ ఇన్స్పెక్టర్ వి రవికుమార్ గారు, ఆర్ ఐ సతీష్ గారు కైకలూరు టౌన్ ఎస్సైలు శ్రీనివాస్ వెంకట కుమార్ కైకలూరు ఎస్సై రాంబాబు గారు కలిదిండి ఎస్ఐ వెంకటేశ్వరరావు గారు మండల ఎస్సై రామచంద్రరావు గారు మరియు ముదినేపల్లి ఎస్సై వీరభద్ర రావు గారు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Search
Categories
Read More
SURAKSHA
సైబర్ నేరాల బారిన పడకండి.-- జిల్లా ఎస్పీ శ్రీ ఆర్.గంగాధరరావు, ఐపిఎస్. |
🚨 కృష్ణాజిల్లా ప్రజలందరికీ పోలీసు వారి ముఖ్యమైన హెచ్చరిక 🚨 సాంకేతికత అందరికీ అందుబాటులోకి ఎంత...
By Bharat Aawaz 2025-09-09 05:19:13 0 567
Telangana
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త రేషన్ కార్డ్ పథకాన్ని ప్రారంభించింది. - కొత్త రేషన్ కార్డ్ – మీసేవలో ఎలా అప్లై చేసుకోవాలి?
📝 కొత్త రేషన్ కార్డ్ – మీసేవలో ఎలా అప్లై చేసుకోవాలి? 🌟 ప్రధానాంశాలు:  తెలంగాణ...
By Bharat Aawaz 2025-06-23 14:17:43 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com