వై బెండ్ 2 k26 పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల మనోహర్

0
95

“వైబ్రన్స్ 2K26” పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల మనోహర్..

 

విజయవాడ, 13- డిసెంబర్ -2025

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ని సెక్రటేరియట్ లో కలిసి రాష్ట్రవ్యాప్త ఇంటర్-కాలేజియేట్ కల్చరల్ & టెక్నికల్ మహోత్సవం “వైబ్రన్స్ 2K26” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయమని విజయవాడ లో ని పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జున రావు కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సిబ్బంది ఆహ్వానించినట్లు ప్రకటనలో తెలిపారు.

 

 ఈ సందర్భంగా “వైబ్రన్స్ 2K26” అధికారిక పోస్టర్‌ను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు.

 

కార్యక్రమంలో కళాశాల ప్రెసిడెంట్ చలవాది మల్లికార్జున రావు, వైస్ ప్రెసిడెంట్ పొట్టి సురేంద్ర కుమార్, సెక్రటరీ & కరస్పాండెంట్ సి.ఎ డా. చిట్టా అమర్ సుదీర్, జాయింట్ సెక్రటరీ గ్రంధి పవన్ కుమార్, కళాశాల ట్రెజరర్ కాజా రాఘవయ్య, ప్రిన్సిపాల్ డా. యస్. శరవణ కుమార్, ఫెస్ట్ కో-ఆర్డినేటర్లు డా. అక్బర్, శ్రీమతి నవ్యశ్రీ, మరియు యం. విక్టర్ జాన్సన్ తదితరులు మంత్రిని ఆహ్వానించిన వారిలో ఉన్నారు..

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com