హెల్మెట్ ధరించండి మీ ప్రాణాలు కాపాడుకోండి గూడూరు ఎస్సై హనుమంత రెడ్డి

0
80

హెల్మెట్ ధరించి వాహనాలు నడిపి నీ ప్రాణాలు కాపాడుకోండని గూడూరు ఎస్సై హనుమంత రెడ్డి అన్నారు బుధవారం స్థానిక పాత బస్టాండ్ లో హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న వారిని ఆపి వారికి హెల్మెట్ విషయంలో కౌన్సిలింగ్ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు మద్యం సేవించి అతివేగంగా వాహనాలు నడపరాదని అతివేగం ప్రాణాలకు హానికరమని అన్నారు లైసెన్సులు లేనిదే వాహనాలు నడప రాదని చిన్న చిన్న పిల్లలకు తల్లిదండ్రులు మోటార్ సైకిల్ ఇచ్చి వాహనాలు నడిపేందుకు సహకరిస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు వాహనాల విషయంలో జాగ్రత్త ఉండాలని కోరారు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించి ప్రయాణం చేయాలని లేని పక్షంలో ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని వారికి కఠినంగా శిక్షించి రుసుములు వేస్తామని హెచ్చరించారు ఈయన వెంట పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
ఆశా వర్కర్లకు పెండింగ్ బకాయిలను చెల్లించాలి- కార్పొరేటర్ శ్రవణ్
   మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :   మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ మల్కాజ్గిరి...
By Sidhu Maroju 2025-09-15 16:52:46 0 143
Telangana
దొంతిరి కార్తీక్ రెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ రామ్ లీలా మైదానంలో దొంతిరి కార్తీక్...
By Sidhu Maroju 2025-12-07 15:17:59 0 86
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com