దీక్ష దివస్ ను పురస్కరించుకొని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం.|

0
237

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  ఈరోజు “దీక్ష దివస్”ను పురస్కరించుకొని మల్కాజ్గిరి నియోజకవర్గంలో భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి. 

మల్కాజిగిరి చౌరస్తా వద్ద తెలంగాణ తొలి ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు  చిత్రపటానికి పాలాభిషేకం చేశాక, అనంతరం వినాయక నగర్ చౌరస్తా, నేరేడ్మెట్ చౌరస్తా, అల్వాల్ మీ సేవ చౌరస్తాలలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 

అక్కడి నుంచి కార్ల ర్యాలీగా గండి మైసమ్మ – మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వైపు ప్రస్తుత కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే బయలుదేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి  మాట్లాడుతూ—

కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ ప్రజల కోసం చేసిన నిరంతర దీక్షలు, పోరాటాలు రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయని అన్నారు. ప్రజల హక్కుల కోసం, తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించేందుకు ఈ రోజు “దీక్ష దివస్”ను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఏం బీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్,కార్పొరేటర్లు మేకల సునీత రాము యాదవ్, శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా అనిల్ కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, రావుల అంజయ్య,  జేఏసి వెంకన్న, తోట నరేందర్ రెడ్డి, డోలి రమేష్, ఢిల్లి పరమేష్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, యువజన విభాగం, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
ఏఐఎస్ఎఫ్ నాయకులు కరపత్రం విడుదల చేయడం జరిగింది
కర్నూలు జిల్లాలోని జులై 1 నుండి 4 వరకు కర్నూలు నగరంలో జరగనున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక...
By Boya Dasthagiri 2026-05-27 13:18:11 0 202
Telangana
ఆసాంఘిక కార్యక్రమాలపై ఉక్కు పాదం ఎస్సై హనుమా నాయక్
చిలుకూరు 06.05.26 (భారత్ ఆవాజ్ న్యూస్) అక్రమ కార్యక్రమాలపై 100కు సమాచారం ఇవ్వండి, నేరాల నివారణలో...
By Nookapangu Manikanta 2026-05-06 14:51:36 0 142
Andhra Pradesh
Pawan Kalyan: అమరావతి బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. ఇది చారిత్రాత్మక ఘట్టమన్న పవన్ కల్యాణ్.
ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని నిర్ధారిస్తూ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లు...
By Pagadala Venkateswar 2026-04-02 06:17:42 0 303
Andhra Pradesh
కదిరిలో గోవుల తరలింపుపై స్థానికుల ఆందోళన
భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి: కదిరి పట్టణంలో గోవులను అక్రమంగా తరలిస్తున్న ఘటనలు నిత్యం...
By Vinod Kumar 2026-09-11 17:01:59 0 210
Telangana
"అల్వాల్ డీవీఎంసీ సమావేశంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఫైర్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్‌లోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శ్యాంప్రకాశ్ అధ్యక్షతన...
By Sidhu Maroju 2026-05-14 13:25:21 0 316
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com