Pawan Kalyan: అమరావతి బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. ఇది చారిత్రాత్మక ఘట్టమన్న పవన్ కల్యాణ్.

0
302

ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని నిర్ధారిస్తూ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందడంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే ఒక చారిత్రాత్మక, కీలకమైన ఘట్టమని అభివర్ణించారు. ఈ చరిత్రాత్మక సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు కోట్ల మంది ప్రజలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రజల సంకల్పానికి, ఆకాంక్షలకు ఈ బిల్లు ప్రతిబింబమని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.

 

ఈ సందర్భంగా అమరావతి రైతుల మహోన్నత త్యాగాన్ని పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా స్మరించుకున్నారు. "తరతరాలు గుర్తుంచుకునేలా, అపారమైన విశ్వాసంతో 33,000 ఎకరాలకు పైగా భూములను రాజధాని కోసం త్యాగం చేసిన రైతులకు నా ప్రగాఢ గౌరవాన్ని, కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను" అని పేర్కొన్నారు. అదే సమయంలో, అమరావతికి బలమైన పునాది వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనిక నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా కొనియాడారు. ఈ బృహత్ కార్యం వాస్తవరూపం దాల్చడానికి నిరంతరం మద్దతుగా నిలుస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ఎన్డీయే ప్రభుత్వానికి పవన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

 

గత ప్రభుత్వ తిరోగమన, ఏకపక్ష నిర్ణయాల వల్ల రాష్ట్రం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొందని పవన్ విమర్శించారు. రైతుల పోరాటాలు, మహిళల ఆవేదన, యువత భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రజలు అసాధారణమైన ధైర్యాన్ని, స్పష్టతను ప్రదర్శించారని కొనియాడారు. స్థిరమైన ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా ప్రజలు అభివృద్ధికి, సుస్థిరతకు పట్టం కట్టారని అన్నారు.

 

పార్లమెంటు ఆమోదంతో రాష్ట్ర ప్రజల్లోనే కాకుండా, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల్లోనూ బలమైన, పునరుత్తేజంతో కూడిన విశ్వాసం ఏర్పడిందని పవన్ అభిప్రాయపడ్డారు. అమరావతి కేవలం రాజధానిగానే కాకుండా, రాష్ట్ర ప్రజల ఆశ, సంకల్పం, సమష్టి కృషికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్, ప్రధాని మోదీ ఆవిష్కరించిన వికసిత భారత్ లక్ష్యాల సాధనలో అమరావతి కీలక పాత్ర పోషిస్తుందని ఆయన దృఢ విశ్వాసం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
తేది :16.6.2026 కొత్తూరు గ్రామం వెలుగొండ ప్రాజెక్ట్ ====
తేది :16.6.2026. కొత్తూరు గ్రామం.వెలుగొండ ప్రాజెక్ట్ =======  ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆగస్టు...
By Chennaiah Kati 2026-06-16 09:10:49 0 115
Andhra Pradesh
మద్యం సేవిస్తే క్యాన్సర్ ముప్పు జాగ్రత్త
భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి : మద్యం  సేవించడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదని,...
By Vinod Kumar 2026-09-11 17:24:51 0 216
Andhra Pradesh
జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసిన శ్రీమతి బుట్టా రేణుక
ఎమ్మిగనూరు ప్రాంతానికి చెందిన వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీల చేనేత వస్త్ర విక్రయ కేంద్రాలను...
By Boya Dasthagiri 2026-03-28 23:49:06 0 418
Andhra Pradesh
DSF ఆధ్వర్యంలో
 పెద్దకడబూరు మండలం జలవాడి గ్రామంలోని పాఠశాలను డీఎస్ఎఫ్ బృందం సందర్శించి పాఠశాలలో...
By Boya Dasthagiri 2026-08-22 15:04:35 0 159
Telangana
నిజామాబాద్
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశానుసారం నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 కార్యక్రమంలో...
By Sadaq Sadaq 2026-05-26 02:44:49 0 113
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com