భారతీయ జనతా పార్టీ ఓబిసి మోర్చా ధర్నా.|

0
50

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్గిరి జిల్లా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు అల్వాల్ ఈ సేవ కూడలిలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా జీవో నంబర్ 46 ద్వారా 17% కి పరిమితం చేయడం ద్వారా 12728 గ్రామాల్లో కేవలం 2176 గ్రామాల్లో మాత్రమే bc ల కు పోటీ చేసే పరిస్థితి వల్ల బిసి ల ను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి లో బీసీ డిక్లరేషన్ పేరిట 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని నమ్మ బలికి అమలు కానటువంటి 6 హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసి తెలంగాణ లో అధికారం లోకి వచ్చారని తెలిపారు. 

42 శాతం ఇస్తాం అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి బీసీ లను నిండా మోసం చేస్తున్నాడని రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా కోరారు.

Sidhumaroju

Search
Categories
Read More
Telangana
వేములవాడ దేవాలయంపై తప్పుడు ప్రచారం నమ్మవద్దు
ఓం నమశ్శివాయ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఈనెల 15వ తేదీ నుండి మూసి వేయబడుతుంది అనే...
By Vadla Egonda 2025-06-19 10:37:04 0 1K
Andhra Pradesh
కోడుమూరు నియోజకవర్గ తెలుగుదేశం సీనియర్ నాయకుడు కే డి సి సి చైర్మన్ డి.విష్ణువర్ధన్ రెడ్డి
నియోజకవర్గ తెలుగుదేశం సీనియర్ నాయకుడు కే డి సి సి చైర్మన్ డి.విష్ణువర్ధన్ రెడ్డి గారిని...
By mahaboob basha 2025-06-09 14:24:34 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com