మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి - ఘనంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే.|

0
42

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి  ఈరోజు క్యాంపు కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ—

సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కోసం మహాత్మ జ్యోతిరావు పూలే  చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోయాయని, ఆయన ఆలోచనలు సామాజిక సమానత్వానికి మార్గదర్శకులుగా నిలిచాయన్నారు. శ్రమజీవుల హక్కులు, బాలికా విద్య, సామాజిక సంస్కరణల కోసం పూలే గారు చేసిన పోరాటం నేటికీ ప్రేరణగా ఉంటుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వెంకటాపురం కార్పొరేటర్ శ్రీమతి సబితా అనిల్ కిషోర్ గౌడ్, బిఆర్‌ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్,ఖలీల్, శరణ గిరి, సురేష్, ప్రభాకర్ , మైవన్, అరుణ్, సోమయ్య, హబీబ్ తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com