అరుంధతి ఆసుపత్రిలో ఉచిత వైద్యసేవలు -పరిశీలించిన నియోజక వర్గ నాయకులు.|

0
39

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : మల్కాజ్గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి  దుండిగల్‌లోని అరుంధతి ఆస్పత్రిని మల్కాజ్గిరి నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. ఆస్పత్రిలో ఉచితంగా అందిస్తున్న నాణ్యమైన వైద్య సేవలను ప్రత్యక్షంగా పరిశీలించి, రాష్ట్రం నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఈ సేవలను వినియోగించుకుంటున్న విధానాన్ని సమీక్షించారు.

అత్యాధునిక సౌకర్యాలతో, పేద ప్రజలకు పూర్తిగా ఉచితంగా వైద్య‌సేవలు అందించడం అరుంధతి ఆస్పత్రి ప్రత్యేకత అని నాయకులు పేర్కొన్నారు. మల్కాజ్గిరి ప్రజలు ఈ సేవలను మరింతగా ఉపయోగించుకోవాలని సూచించారు.

అరుంధతి ఆసుపత్రి సేవలు పేద ప్రజలకు వరం వంటిదని నాయకులు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో  చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా అనిల్ కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్,  మేకల రాము యాదవ్, అనిల్ కిషోర్ గౌడ్, డోలి రమేష్,  తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
రాయలసీమలో రైతుల ఇబ్బందులు: వర్షం తక్కువ, ధరలు కుదిరలేక |
రాయలసీమలో రైతుల ఇబ్బందులు: వర్షం తక్కువ, ధరలు కుదిరలేక రాయలసీమ ప్రాంతంలో వర్షాలు తక్కువగా పడటంతో...
By Bharat Aawaz 2025-09-20 10:43:35 0 244
Telangana
హైదరాబాద్ మెట్రో – దేశంలో రెండో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్, దేశంలో రెండవ అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా...
By Bharat Aawaz 2025-08-12 07:25:07 0 587
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com