మల్కాజ్ గిరి లో నూతన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ప్రారంభం.|

0
33

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి ఆర్‌.కే.నగర్, శ్రీ పంచమి హోటల్ సమీపంలో కొత్తగా ఏర్పాటుచేసిన ఆల్వాల్ ఆప్కారి (ఎక్సైజ్) పోలీస్ స్టేషన్ ను మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరై కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. ప్రజల భద్రత, చట్టం మరియు న్యాయం పరిరక్షణలో ఎక్సైజ్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. కొత్త స్టేషన్ ప్రారంభంతో అక్రమ మద్యం రవాణా, వినియోగంపై మరింత కట్టడి సాధ్యమవుతుందని తెలిపారు. ప్రజలకు సేవ చేయడంలో అధికారులు సమర్థంగా వ్యవహరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో.. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి, అల్వాల్–మల్కాజ్‌గిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్‌.ఐ లు కుమార స్వామి, సంధ్య రాణి, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తో పాటు,     కార్పొరేటర్లు శ్రీమతి చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా అనిల్ కిషోర్ గౌడ్, మేకల సునీత, రాము యాదవ్, మాజీ కార్పొరేటర్లు జగదీష్ గౌడ్, ఆకుల నర్సింగ్ రావు, అలాగే నాయకులు జేఏసీ వెంకన్న, మేకల రాము యాదవ్, అనిల్ కిషోర్ గౌడ్, డోలి రమేష్, అరుణ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
కుత్బుల్లాపూర్ తాసిల్దార్ కార్యాలయంలో పనులు సకాలంలో జరగడం లేదు. ఆరోపించిన ఎన్జీవో భాగ్యలక్ష్మి ఫౌండేషన్ ఫౌండర్ మాణిక్య చారి.
కుత్బుల్లాపూర్ తహసిల్దార్ కార్యాలయం లో గత రెండు నెలల నుండి అధికారులు కుల దృవీకరణ పత్రాలు సకాలంలో...
By Sidhu Maroju 2025-06-11 15:16:37 0 1K
Telangana
ఆగస్టు ఒకటి తారీకు నుంచి టీచర్లకు ముఖ గుర్తింపు తప్పనిసరి
రేపటి నుంచి టీచర్లకు ముఖగుర్తింపు హాజరు హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు...
By Vadla Egonda 2025-07-31 14:44:39 0 1K
Andhra Pradesh
వామ్మో ఇది మన నగర పంచాయతీ ..కాలం చెల్లిన నగర పంచాయతీ చూస్తే ప్రజలకు భయం వేస్తుంది
పేరుకే నగర పంచాయతీ అభివృద్ధి మాత్రం నోచుకోవడం లేదు, వర్షం వస్తే చాలు కంప్యూటర్లు,ఫైళ్లను మూత...
By mahaboob basha 2025-08-18 23:28:08 0 500
Andhra Pradesh
పవన్ కళ్యాణ్ (ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి) తెలుగు సినీ పరిశ్రమ (టాలీవుడ్)పై విమర్శలు చేశారు.
పవన్ కళ్యాణ్ (ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి) తెలుగు సినీ పరిశ్రమ (టాలీవుడ్)పై విమర్శలు చేశారు....
By Bharat Aawaz 2025-05-27 05:53:21 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com